Breaking News

15/10/2019

ఒంటరి పోరులో లక్ కోసం మాయావతి

లక్నో, అక్టోబరు (way2newstv.in)
ఉత్తరప్రదేశ్ లో మరోసారి లక్ కోసం ప్రయత్నిస్తున్నారు బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూసిన మాయావతి ఈ ఎన్నికల్లోనైనా విజయం సాధించి క్యాడర్ లో ధైర్యం నింపాలని ప్రయత్నిస్తున్నారు. శ్రమిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లో మొత్తం 11 శాసనసభ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో ఒక్కటి మాత్రమే బీఎస్పీ సిట్టింగ్ స్థానం. మిగిలిన వాటిలో 9 స్థానాలు బీజేపీ, ఒక స్థానం సమాజ్ వాదీ పార్టీది.మాయావతి తన దీర్ఘకాల శత్రువైన సమాజ్ వాదీ పార్టీతో గత లోక్ సభ ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని తప్పు చేశామని భావిస్తున్నారు. 
ఒంటరి పోరులో లక్ కోసం మాయావతి

అఖిలేష్ యాదవ్ కోరిక మేరకు తాము అప్పట్లో పొత్తుకు దిగామని కార్యకర్తల సమావేశాల్లో చెబుతున్నారు. భారతీయ జనతా పార్టీని రాష్ట్రంలో నిలువరించేందుకే లోక్ సభ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీతో చేతులు కలపాల్సి వచ్చిందని మాయావతి వివరణ ఇచ్చుకుంటున్నారు. కానీ లోక్ సభ ఎన్నికల్లో బీఎస్పీ, ఎస్పీలు కలిసినా క్యాడర్ మాత్రం కలవలేదు. ఓట్ల బదిలీ జరగలేదు.అందుకే లోక్ సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే మాయావతి పొత్తుకు ఫుల్ స్టాప్ పెట్టారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇక ఏ ఎన్నిక జరిగినా తాము ఒంటరిగానే బరిలోకి దిగుతామని స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికలు 2022 లో జరగనున్నాయి. ఈలోగా పార్టీని సమాయత్తం చేయాలన్నది మాయావతి ఆలోచన. ఇప్పటికే వరస ఓటములతో బీఎస్పీ క్యాడర్ నిస్తేజంలోకి వెళ్లింది. సమాజ్ వాదీ పార్టీతో పొత్తు కారణంగా కొన్ని సామాజికవర్గాల ఓట్లను మాయావతి కోల్పోవాల్సి వచ్చింది. వాటిని తిరిగి రాబట్టుకునేందుకు బెహన్ జీ .అందుకోసమే ఉత్తరప్రదేశ్ లో జరిగే 11 శాసనసభ స్థానాల ఉప ఎన్నికల్లో మాయావతి ఒంటిరిగా పోటీ చేస్తున్నారు. బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపారు. ఈ ఎన్నికలను సవాల్ గా తీసుకోవాలని పార్టీ నేతలకు సీరియస్ వార్నింగ్ లు ఇచ్చారు మాయావతి. అంతేకాదు సిట్టింగ్ స్థానంతో పాటు మరికొన్ని స్థానాలను రాబట్టాలని సీనియర్ నేతలకు పరీక్ష పెట్టారు మాయావతి. ఈ స్థానాల్లో చతుర్ముఖ పోటీ ఉన్నప్పటికీ బీజేపీకి అనుకూలంగా ఉందంటున్నారు. మాయావతి ఈ ప్రయోగం ఎంతవరకూ సక్సెస్ అవుతుందో చూడాలి

No comments:

Post a Comment