Breaking News

28/10/2019

అంగన్ వాడీలకు స్మార్ట్ లుక్...

హైద్రాబాద్, అక్టోబరు 28, (way2newstv.in)
రాష్ట్రంలోని అంగన్ వాడీలు అన్నింటికీ స్మార్ట్ లుక్ వస్తోంది. ప్రతి రోజూ బయోమెట్రిక్ హాజరు, పౌష్టికాహార వివరాల నమోదుకు అన్ని అంగన్ వాడీ సెంటర్లకూ స్మార్ట్ ఫోన్లను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. పోషణ అభియాన్ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం సంస్కరణలు చేపట్టింది. అంగన్ వాడీ సెంటర్ల నిర్వహణలో పారదర్శకత, చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందిం చే సేవల్లో నాణ్యత పెంచేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే స్మార్ట్ ఫోన్లను రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తోంది. రాష్ట్రంలో మొత్తం 35,700 అంగన్ వాడీ కేంద్రాలు ఉండగా.. 11 వేల సెంటర్లకు ఇప్పటికే అధికారులు స్మార్ ట్ఫోన్లు అందజేశారు.
అంగన్ వాడీలకు స్మార్ట్ లుక్...

మిగతా 24,700 సెంటర్లకు మరో రెండు నెలల్లో ఫోన్లు అందజేయాలని టార్గెట్ పెట్టుకున్నారు.ఇవి అందుబాటులోకి వస్తే అంగన్ వాడీ టీచర్లు చేపట్టే ఫ్యామిలీ సర్వే, ఇమ్యునైజేషన్, న్యూట్రిషన్ మానిటరింగ్, బాలామృతం, కోడిగుడ్లు, ఆరోగ్యలక్ష్మీ పథకం లబ్ధిదారుల వివరాలు ఒక్క క్లిక్ తోనే పెద్దా ఫీసర్లకు తెలియనున్నాయి. స్మార్ట్ ఫోన్లను వాడటంలో ప్రావీణ్యం సంపాదిస్తే అంగన్ వాడీ సెంటర్ల నిర్వా హకులపై పని భారమూ తగ్గుతుంది.14 రిజిస్టర్లు అవసరం లేదు ఇప్పటి వరకు అంగన్ వాడీ టీచర్లు 14 రిజిస్టర్లను మెయింటే న్ చేస్తున్నారు. కొందరు 15 రోజులకోసారి, మరికొందరు నెలకోసారి వాటిని అప్ డేట్ చేస్తుండేవారు. ఉన్నతాధికారులు ఎప్పుడైనా సెంటర్ కు వెళ్లి తనిఖీ చేస్తే తప్ప.. అక్కడ ఏం జరుగుతుందో, ఎంత మంది లాభపడేటోళ్లు ఉన్నారో తెలిసేది కాదు. నెలకోసారి చిన్నారులు, బాలింతలు, గర్భిణుల డేటాను, స్టాక్ రిజిస్టర్లను అప్ డేట్ చేసి ఆన్ లైన్ చేసినప్పడే వివరాలు తెలిసేవి. అంగన్ వాడీ సెంటర్ల సేవల్లో పారదర్శత పెంచడం, పేపర్ వాడకం తగ్గిం చడమే లక్ష్యంగా అధికారులు స్మార్ట్‌‌ ఫోన్లను అందుబాటులోకి తెచ్చారు. ఫోన్లలో కామన్ అప్లికేష న్ సాఫ్ట్‌‌వేర్(సీఏఎస్) యాప్ ద్వా రా 14 రకాల రిజిస్టర్లను 14 రకాల కాలమ్స్‌ లో నమోదు చేయనున్నారు.ప్రస్తుతం తెలుగు, ఇంగ్లి ష్ లో నమోదు చేసేలా అవకాశమిచ్చారు. కొత్త సాఫ్ట్‌‌ వేర్ తో లబ్ధిదారుల హాజరును బయోమెట్రిక్ లో తీసుకోవడంతోపాటు భవిష్యత్ లో ఫొటోనూ పెట్టాల్సి ఉండడంతో సేవల్లో పారదర్శకత పెరగనుంది. వివరాలు ఆన్ లైన్ కావడంతో సీడీపీవో స్థా యి నుంచి హైదరాబాద్, ఢిల్లీ కార్యాలయాల్లోని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు చూడొచ్చు. యాప్ వాడకంపై మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ ఇచ్చారు. వారు హైదరాబాద్, రంగారెడ్ డి, ఆదిలాబాద్ జిల్లాల్లో అంగన్ వాడీ టీచర్లకు శిక్షణ ఇస్తున్నారు.

No comments:

Post a Comment