Breaking News

11/10/2019

వ్యవసాయానికి పెద్ద పీట

వనపర్తి అక్టోబర్ 11 (way2newstv.in):
రైతుల సంక్షేమం లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయంపై 60 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు.  శుక్రవారం ఆయన వనపర్తి జిల్లా గోపాల్పేట మండల కేంద్రంలో  24       లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవనం మరియు దుకాణాల సముదాయాన్ని ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ రంగానికి, ప్రత్యేకించి రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నదని తెలిపారు. 
వ్యవసాయానికి పెద్ద పీట

రైతు బంధు పథకం కింద 12 వేల కోట్ల రూపాయలు, రైతు భీమా పథకం కింద పదమూడు వందల కోట్ల రూపాయలు, రైతు రుణమాఫీ పథకం కింద 8 వేల కోట్ల రూపాయలు, విత్తనాలు, ఎరువులు తదితర సబ్సిడీ కింద మార్క్ఫెడ్ ద్వారా 1000 కోట్ల రూపాయలు, ఎత్తిపోతల పథకాల విద్యుత్పై ఐదు వేల కోట్ల రూపాయలు ఇలా మొత్తం 60 వేల కోట్ల రూపాయల వ్యవసాయ రంగం పైనే ఖర్చు చేస్తున్నట్లు వివరించారు. రాష్ట్రంలో దేనికైనా వ్యవసాయమే ముందు అన్న భావన రైతు బంధు పథకం కింద 51 లక్షల మంది రైతులకు రైతుబంధు నిధులు ఇవ్వవలసి ఉండగా ఇప్పటివరకు 43 లక్షల మందికి ఇచ్చామని, తక్కినవారికి కూడా వారివారి అకౌంట్లలో జమ చేస్తున్నామని తెలిపారు.         ఈ సంవత్సరం రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవడం వల్ల ఇప్పటివరకు కోటి 11 లక్షల ఎకరాలలో రైతులు పంటలు సాగు చేసినట్లు మంత్రి వెల్లడించారు. వ్యవసాయ సాగు, ఎరువులు విత్తనాల కారణంగా రైతులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు రాబోయే రోజుల్లో రాష్ట్రంలో సమగ్ర విత్తన పాలసీని తీసుకురానున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ సంవత్సరం సాగునీటి ప్రాజెక్టుల వల్ల ఆయకట్టు పెరిగినందున వ్యవసాయ విస్తీర్ణం పెరిగిందని, అలాగే యూరియా వాడకం కూడా పెరిగిందని, ఈ సంవత్సరం ఇప్పటి వరకు 9 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను రైతులు వాడారని తెలిపారు. యూరియా కు రాష్ట్రంలో ఎలాంటి కొరత లేదని, ఎంత కావాలన్నా ఇస్తామని, రాష్ట్రానికి అవసరమైనంత యూరియా సరఫరా గురించి ఇటీవలే కేంద్ర ఎరువుల శాఖ మంత్రితో ప్రత్యక్షంగా కలిసి తెలంగాణ రైతులకు ఇబ్బంది లేకుండా యూరియాను సరఫరా చేయాలని విజ్ఞప్తి చేసినట్లు మంత్రి పేర్కొన్నారు.ఎరువుల వాడకంలో రైతులు సహేతుక పద్ధతి పాటించాలని, ఎకరాకు 40 కేజీల ఏరియా మాత్రమే సరిపోతుందని, కానీ రైతులు ఎకరాకు 100 కిలోల పైనే వాడుతున్నారని, దీనివల్ల భూసారం దెబ్బతిని, పంటలు నష్టపోయే అవకాశం ఉందన్నారు.           రాష్ట్రంలో వ్యవసాయ అభివృద్ధిని, రైతుల కు అవసరమయ్యే ఎరువులు,  విత్తనాలను దృష్టిలో ఉంచుకొని మూతబడి పోయిన రామగుండం ఎరువుల కర్మాగారాన్ని రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరించ నున్నట్లు మంత్రి వెల్లడించారు. అలాగే రాబోయే రోజుల్లో ఎరువుల వాడకంపై రైతులకు పూర్తి అవగాహన కల్పిస్తామని తెలిపారు.        డిసిసిబి అధ్యక్షులు వీరా రెడ్డి మాట్లాడుతూ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా రుణాలతో పాటు ఎరువులు , విత్తనాలు కూడా సరఫరా చేస్తున్నామని , ప్రత్యేకించి గోపాల్పేట ప్రాథమిక వ్యవసాయ  సంఘ భవనాన్ని, దుకాణాల సముదాయం నిర్మించుకోవడం సంతోషం అని అన్నారు

No comments:

Post a Comment