Breaking News

11/10/2019

ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ వెబ్ సైట్ ను ప్రారంభించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

ములుగు ఫారెస్ట్ రీసెర్చ్ సెంటర్ భూమిని ఫారెస్ట్ కాలేజీ అవసరాలకు ఉపయోగించేలా ఒప్పందం
ఎంఓయూపై మంత్రి సమక్షంలో సంతకాలు చేసిన అటవీ అధికారుల బృందం
హైదరాబాద్, అక్టోబర్ 11:(way2newstv.in):
అటవీ అభివృద్ది, పచ్చదనం పెంపుకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతలో భాగంగా కొత్తగా నిర్మించిన అటవీ కళాశాల, పరిశోధనా సంస్థ త్వరలోనే అందుబాటులోకి రానుందని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. అరణ్య భవన్ లో శుక్రవారం ఫారెస్ట్ కాలేజీ కోసం కొత్తగా రూపొందించిన వెబ్ సైట్ ను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ నాణ్యమైన, ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించి అటవీ యాజమాన్యంలో విద్యార్థులను నిష్ణాతులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ములుగులో అటవీ కళాశాల, పరిశోధనా సంస్థను ఏర్పాటు చేశారన్నారు. 
ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ వెబ్ సైట్ ను ప్రారంభించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

హైదరాబాద్ శివారు ములుగుకు సమీపంలో  రూ.75 కోట్లతో నిర్మించిన కొత్త క్యాంపస్ సిద్దమైందని తెలిపారు. త్వరలోనే ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ప్రారంభిస్తారని మంత్రి వెల్లడించారు.  అటవీ అభివృద్దికి, పచ్చదనం పెంపుకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతలో భాగంగా ఈ కొత్త అటవీ కాలేజీ క్యాంపస్ మరో మైలురాయిగా నిలుస్తుందన్నారు. అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్,  సెంట్రల్ లైబ్రరీ,  జియోమెట్రిక్ ల్యాబ్స్, వేర్వేరుగా బాయ్స్ అండ్ గర్ల్ హస్టల్స్,  మెస్ బ్లాక్, స్టాఫ్ క్వార్టర్స్ తో పాటు ఇతర సదుపాయాలను కల్పిస్తున్నామన్నారు. ములుగులో ఆధునిక క్యాంపస్ ప్రారంభకాగానే ప్రస్తుతం దూలపల్లిలో ఉన్న కాలేజీని అక్కడికి మారుస్తామని మంత్రి తెలిపారు.  2016లో ప్రారంభమైన బీఎస్సీ ఫారెస్ట్రీ కోర్సు దూలపల్లి ఫారెస్ట్ అకాడమీ క్యాంపస్లో నాలుగో బ్యాచ్ కొనసాగుతోందని, కళాశాలలో నిపుణలైన ప్రొఫెసర్లు విద్యాబోధన చేస్తున్నారని, వచ్చే ఏడాది (2020) నుంచి ఫారెస్ట్రీలో ఎమ్మెస్సీ, 2022 నుంచి  పీహెచ్డీ ఫారెస్ట్రీ కోర్సులను ప్రవేశపెడతామని కాలేజీ డీన్ డాక్టర్ జీ. చంద్రశేఖర రెడ్డి తెలిపారు. మరోవైపు కొత్త క్యాంపస్ అవసరాలు, పరిశోధనలు, ఫారెస్ట్ రీసెర్చ్, నర్సరీలు, వుడ్ వర్కషాపు తదితరాల ఏర్పాటుకు వీలుగా ములుగు రీసెర్చ్ సెంటర్ ఆధీనంలో ఉన్న 130 ఎకరాల భూమిని ఫారెస్ట్ కాలేజీకి బదలాయిస్తూ ఒప్పందం కుదిరింది. ఈమేరకు అధికారులు మంత్రి సమక్షంలో ఎంఓయూపై సంతకాలు చేశారు. సమావేశంలో అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారి, పీసీసీఎఫ్ లు ఆర్ శోభ, మునీంద్ర, సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, అదనపు పీసీసీఎఫ్ లు లోకేశ్ జైస్వాల్, పర్గయిన్, సిద్దానంద్ కుక్రేటీ, అటవీ కాలేజీ అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.

No comments:

Post a Comment