Breaking News

09/10/2019

ఇప్పుడు వైసీపీ కోసం క్యూ కడుతున్నారు

విశాఖపట్టణం, అక్టోబరు 9, (way2newstv.in)
ఏపీలో వైసీపీకి చాలినంత బలం ఉంది. పార్టీ కూడా చాలా పటిష్టంగా ఉంది. ఇక అధికారంలో రావడానికి అవసరమైన దానికంటే రెండింతల బలాన్ని జనాలు ఇచ్చి జగన్ ని ముఖ్యమంత్రిని చేశారు. మరో అయిదేళ్ల వరకూ ఏపీలో ఎన్నికలు లేవు. ఇక టీడీపీ పరిస్థితి చూస్తే నానాటికీ తీసికట్టు నాగంభొట్లు అన్నట్లుగా తయారైంది. చంద్ర్రబాబు వయసు రీత్యా మునుపటి మాదిరిగా చురుకుగా ఉండలేకపోతున్నారు ఆయన ప్రకటనలు, విమర్శలు కూడా ఇటీవల నవ్వులపాలు అవుతున్నాయి. దీంతో ఆ పార్టీ నుంచి నేతలు సహజంగానే బయటకు రావాలనుకుంటున్నారు. వీరిలో కొందరిని బీజేపీ ఆకట్టుకుంటే మరికొందరు వైసీపీ వైపు చూస్తున్నారు. ఈ క్రమంలో విశాఖ అర్బన్ జిల్లాలోనూ అనేకమంది వైసీపీలోకి రావాలనుకుంటున్నారు. 
 ఇప్పుడు వైసీపీ కోసం క్యూ కడుతున్నారు

అందులో అర్బన్ జిల్లా ప్రెసిడెంట్ , మాజీ ఎమ్మెల్యే ఎస్ ఎ రహమాన్ పేరు కూడా ఉంది. బలమైన ముస్లిం మైనారిటీ సామాజికవర్గానికి చెందిన రహమాన్ కి టీడీపీలో అన్యాయమే జరిగింది. ఈ బాధ ఆయన అనుచరుల్లో ఉంది.ఇదిలా ఉండగా రహమాన్ సతీమణి షిరీని రహమాన్ సామాజిక కార్యకర్తగా విశాఖలో చిరపరిచితురాలు, వైద్యురాలిగా ఆమె ఉంటున్నారు. ఇక 2009 ఎన్నికలో ప్రజారాజ్యం పార్టీ తరఫున విశాఖ ఉత్తర నియోజకర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. మధ్యపాన నిషేధం విషయంలో జగన్ సర్కార్ తీసుకున్న విధానం బాగుందని తాజాగా మీడియా సమావేశం పెట్టి మరీ షిరీన్ రహమాన్ చెప్పడం విశేషం. అప్పట్లో అన్న నందమూరి తరువాత మళ్ళీ జగన్ ఈ సాహసానికి పూనుకున్నారని ఆమె కొనియాడారు. ముఖ్యంగా బెల్ట్ షాపులు రద్దు చేసి మహిళలకు జగన్ పెద్ద ఉపశమనం కలిగించారని ఆమె అన్నారు. అదే విధంగా ప్రభుత్వం మద్యం దుకాణాలు నిర్వహించడమే కాదు, వాటికి కచ్చితమైన టైమింగ్ పెట్టడం, మద్యం అమ్మకాలపైన పరిమితులు విధించడం కూడా మంచి విధానమని మెచ్చుకున్నారు. ఇది నిజానికి ఉన్నది ఉన్నట్లుగా చెప్పడంగానే చూసినా కూడా ఆమె భర్త టీడీపీ ప్రెసిడెంట్ గా ఉండగా ప్రత్యర్ధి పార్టీకి చెందిన అధినేత జగన్ ను షిరీన్ రహమాన్ పొగడడం టీడీపీలో పెద్ద చర్చకు దారితీస్తోంది.ఇక టీడీపీలో ఉక్కబోతకు గురి అవుతున్న అర్బన్ జిల్లా ప్రెసిడెంట్ రహమాన్ ఎపుడు బయటకు పోదామా అని చూస్తున్నారని ప్రచారం సాగుతోంది. ఆయన్ని విశాఖ జిల్లాలో ఉన్న నలుగురు ఎమ్మెల్యేల్లో ముగ్గురు వ్యతిరేకిస్తున్నారు. దీంతో పార్టీని నడపడం ఎలా అన్న ఆవేదనతో ఉన్నారు. ఈ విషయంలో ఎన్ని సార్లు అధినాయకత్వానికి చెప్పినా కూడా పట్టించుకోవడంలేదని కూడా రహమాన్ మధన పడుతున్నారు. ఇక విశాఖ వస్తున్న చంద్రబాబు దృష్టికి మరో మారు ఈ సమస్యను పెట్టి ఆయన స్పందన‌ను చూశాక పార్టీకి పెద్ద నమస్కారం పెడదామని రహమాన్ ఆలోచిస్తున్నారని అంటున్నారు. రహమాన్ లాంటి సీనియర్ పార్టీని వీడితే విశాఖలో టీడీపీకి పెద్ద దెబ్బ పడడం ఖాయం. మైనారిటీ వర్గాల్లో కూడా అది చెడు సంకేతాన్ని ఇస్తుందని కూడా అంటున్నారు. మరి చూడాలి.

No comments:

Post a Comment