Breaking News

09/10/2019

పవన్ పార్టీ నేతల పక్క చూపులు

విజయవాడ, అక్టోబరు 9  (way2newstv.in)
రాజకీయం అంటేనే ఓ వికృతరూపం. అక్కడ బంధాలు ఉండవు, అనురాగాలు అంతకంటే ఉండవు, ఉన్నవన్నీ కూడా అవకాశవాదాలే. ఇపుడున్న కాలంలో కండువా మార్చేసినంతతేలిగ్గా పార్టీ మార్చేస్తున్నారు. ఆ తరువాత అప్పటివరకూ ఉన్న పార్టీ మీద బురద జల్లేస్తున్నారు. ఇది అన్న నందమూరి నాటి నుంచి వస్తున్నదే. ఇపుడు పవన్ కళ్యాణ్ వంతువచ్చిందంతే. 2019 సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పార్టీ గెలుస్తుందని అంతా వచ్చి చేరారు. గెలవకపోయినా కింగ్ మేకర్ అయినా కూడా తమకు అందలాలు పదిలం అనుకున్నవారూ ఉన్నారు. ఇపుడు సీన్ కట్ చేస్తే అధినేతే రెండు చోట్ల నుంచి పోటీ చేసినా ఓటమిపాలు అయ్యారు. దాంతో సహజంగానే చులకనభావం ఏర్పడుతుంది. దానికి తోడు పవన్ కల్యాణ్పార్టీ విషయంలో చూపుతున్న అశ్రద్ధ కూడా ఊతమిస్తోంది. 
పవన్ పార్టీ నేతల పక్క చూపులు

అంతే మాజీ జనసైనికులు రెచ్చిపోతున్నారు.పవన్ కల్యాణ్ పార్టీకి ఓ విధానం, నిర్మాణం లేదని అంటున్నారు ఆ పార్టీ నుంచిబయటకు వచ్చినవారు. ఇక ఇంతకుముందు వెళ్ళినవారు చేసిన ఆరోపణలనే విశాఖ జిల్లా అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన చింతల పార్ధసారధి అంటున్నారు. పవన్కల్యాణ్ పార్టీకి అన్ని జాడ్యాలు ఉన్నాయని ఆయన అనేశారు. చెప్పేందుకే నీతులు అంటూ గట్టిగానే విమర్శలు చేశారు. ఇక పవన్ కల్యాణ్ పార్టీ కుటుంబ పార్టీలకు అతీతం కాదనిఅన్నారు. ఏ అర్హత ఉందని అన్న నాగబాబుకు నర్సాపురం ఎంపీ టికెట్ ఇస్తారని కూడా పవన్ కల్యాణ్ ను ఆయన నిలదీశారు. పార్టీ నిర్మాణం లేకుండా నడపడమేంటని కూడాప్రశ్నించారు. మొత్తానికి పార్టీని వదిలిపోతూ ఈ మాజీ ఐఆర్ఎస్ అధికారి సంధించిన ప్రశ్నలు పవన్ కల్యాణ్ జవాబు చెప్పుకోవాల్సిందే అంటున్నారు.ఇదిలా ఉండగా పవన్ కల్యాణ్పార్టీలో చేరిన వారు చాలా మంది ఎన్నికల తరువాత సైలెంట్ అయిపోయారు. వారిలో కొంతమంది పక్క చూపులు చూస్తున్నారు. నిజానికి పవన్ కల్యాణ్ పార్టీకి బలమైన అభ్యర్ధులుపెద్దగా లేరు. ఉన్న వారు సైతం ఇపుడు గోడ దాటాలనుకుంటున్నారు. ఇప్పటికే విశాఖ నుంచి ఎంపీ సీటుకు పోటీ చేసిన జేడీ లక్ష్మీనారాయణ దాదాపుగా తప్పుకున్నట్లేననిఅంటున్నారు. ఇక పాడేరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు వైసీపీ వైపు చూస్తున్నారు. మరో వైపు విశాఖ జిల్లాలో పార్టీ అధికార ప్రతినిధులుగాకొందరిని నియమించినా వారు కూడా యాక్టివ్ గా లేరు. అలాగే ఏపీలో కూడా మిగిలిన జిల్లాలో నాయకులు బీజేపీ, వైసీపీ వైపు చూస్తున్నారు. ఈ నేపధ్యంలో పవన్ కల్యాణ్ మీదవిమర్శలు చేస్తూ పోతున్నారు. పవన్ కల్యాణ్ ఇప్పటికైనా పార్టీని చక్కదిద్దుకోకపోతే ఈ విమర్శలే నిజమై పార్టీ లోకల్ బాడీ ఎన్నికలకు ముందుగానే ఇబ్బందులో పడినాఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు

No comments:

Post a Comment