Breaking News

24/10/2019

జిల్లా  జాయింట్ కలెక్టర్ వనజా దేవి
పెద్దపల్లి   అక్టోబర్ 24 (way2newstv.in)
 జిల్లాలో వాయిదా పడిన ఆరు మద్యం షాపులకు  మద్యం షాపుల నెంబర్ 45,46,47,48,51,58  లకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం జిల్లా జిల్లా కల్లెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం లాటరీ పద్ధతిలో ఎంపిక చేయడం,వారికి మద్యం షాపుల కేటాయింపు జరుగిందని  జిల్లా జాయింట్ కలెక్టర్ వజనాదేవి అన్నారు. జిల్లాలో నూతనంగా  అనుమతి పొందిన మద్యం షాపులు ఎమ్మార్పీ ధరలకు మాత్రమే మద్యం విక్రయించాలని, జిల్లా జాయింట్ కలెక్టర్ వనజాదేవి తెలిపారు. గురువారం రోజున కల్లెక్టరేట్ సమావేశ మందిరంలో  మద్యం షాపుల అలాట్మెంట్ ప్రక్రియను జాయింట్  కలెక్టర్ స్వయంగా పర్యవేక్షించారు. 
ఎం.ఆర్.పి ధరలకు మధ్యం విక్రయించాలి

అనంతరం జిల్లా  జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ 2019-21 సంవత్సరానికి మద్యం పాలసీ లో జిల్లాలో వాయిదా పడిన ఆరు మద్యం షాపులకు  భాగంగా  6 మద్యం షాపులకు గాను 68 దరఖాస్తులు వచ్చాయని, వీటన్నిటికీ సంబంధించి పారదర్శకంగా లాటరీ పద్ధతిలో మద్యం షాపుల అలాట్మెంట్ , ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం చేపట్టామని తెలిపారు.  మొత్తం 6  మద్యం షాపుల అలాట్మెంట్ ప్రక్రియ లాటరీ పద్ధతిన పూర్తిచేశామని, మద్యం షాపులు అలాట్మెంట్ పొందినవారు కుడిది చలమయ్య,మంఖాలి ఉపేంద్ర,ఓజ్జ కరుణాకర్,మధుగాని హరీష్,వెంకటేశ్వర్ రావు,రాజు లకు లాటరీలో గెలుపొందారని, ప్రభుత్వం నిర్దేశించిన నియమాలను తప్పనిసరిగా పాటించాలని,  జిల్లాను ప్లాస్టిక్ రహిత జిల్లాగా తీర్చిదిద్దే ప్రయత్నంలో భాగంగా మద్యం షాపుల లో సైతం ప్లాస్టిక్ బాటిల్, ప్లాస్టిక్ వాటర్ ప్యాకెట్లు ఇతర సంబంధిత ప్లాస్టిక్ వస్తువులు వినియోగించుకోవడానికి వీల్లేదని, దీనిపై జిల్లా యంత్రాంగం స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తుందని జాయింట్ కలెక్టర్ తెలిపారు.పెద్దపల్లి అభ్కారి శాఖ సూపరిండెంట్ రవికుమార్,  అభ్కారి శాఖ  పెద్దపల్లి సి.ఐ.శ్రీనివాస్, రామగుండం సి.ఐ.రమేష్  సంబంధిత అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

No comments:

Post a Comment