వనపర్తి అక్టోబర్ 24 (way2newstv.in)
హుజూర్ నగర్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించడం పట్ల వనపర్తి జిల్లా టిఆర్ఎస్ నాయకులు బాణసంచా కాల్చుతూ ఘనంగా విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. హుజూర్నగర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి 43.624 ఓట్ల మెజార్టీతో విజయం సాధించడం పట్ల జిల్లా టిఆర్ఎస్ నాయకుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దీంతో గురువారం సాయంత్రం పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో భారీ ఎత్తున బాణసంచా ఖర్చు విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు.
ఘనంగా టిఆర్ఎస్ విజయోత్సవ సంబరాలు
ఈ సందర్భంగా జిల్లా టిఆర్ఎస్ సమన్వయకర్త రంగినేని అభిలాష్ మాట్లాడుతూ హుజూర్నగర్ చరిత్రలోని అత్యధిక మెజార్టీతో టిఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి గెలవడం ఎంతో హర్షించదగ్గ విషయమని ఆయన అన్నారు. ఈ విజయంతో టిఆర్ఎస్ పార్టీ మరింత బలోపేతమై రానున్న మున్సిపల్ ఎన్నికల్లో విజయదుందుభి మోగించడం ఖాయమని ఆయన దీమా వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో రంగినేని అభిలాష్ తో పాటు మాజీ మున్సిపల్ చైర్మన్ రమేష్ గౌడ్, మాజీ కౌన్సిలర్స్ గట్టు యాదవ్, వాకిటి శ్రీధర్, నందిమల్ల శ్యామ్ కుమార్, పుట్టపాక లో పార్వతమ్మ, నాయకులు సూర్యవంశం గిరి, కోళ్ల వెంకటేష్, బండారు కృష్ణ, గంధం పరంజ్యోతి, కాగితాల గిరి, నక్క మహేష్, పుట్టపాక మహేష్, సుభాష్, గోపాల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment