ఇంటర్నెట్ ఒక వ్యసనంగా మారింది. కాని ఈ వ్యసనానికి గురయ్యేమనే స్పృహకూడా చాలా మందిలో కనబడడం లేదు. స్మార్ట్ ఫోన్ రివాల్యుషన్ ఇప్పుడు ప్రమాదాల ఊబిగా మారింది. ఆమె ఒక బ్రిడ్జి పిట్టగోడపై స్టయిల్ గా కూర్చుని మొబైల్ కెమెరా వైపు చిరునవ్వుతూ చూస్తూంది. ఆమె వెనుక బ్యాక్ గ్రౌండ్ నీలిఆకాశం, దూరం వరకు ప్రవహిస్తున్న నదీజలాలు .. అందమైన దృశ్యం. 5.6 కోట్ల మంది ఇంటర్నెట్ సబ్ స్క్రయిబర్లున్నారు. 31 కోట్ల మంది సోషల్ మీడియా యూజర్లున్నారు. రోజుకు 1 జిబి డాటాను ఉపయోగిస్తున్నారు. ప్రపంచంలో అత్యధికంగా రోజుకు సగటు డాటా ఉపయోగించేది భారతీయులే. సగటున ప్రతి భారతీయుడు తన మొ బైల్ ఫోన్ రోజుకు 150 సార్లు చెక్ చేస్తున్నాడు.
ప్రాణం మీదకు సెల్ఫీ వ్యసనం
రోజుకు 1 గంట 29 నిముషాల మ్యూజిక్ స్ట్రీమ్ చేస్తున్నాడు. రోజుకు 52 నిముషాలు వీడియో చూస్తున్నడు. ఫోనులో దాదాపు 200 యాప్స్ ఉపయోగిస్తున్నారు. ఈ యాప్స్ అన్నీ ఉపయోగించడ ం కూడా జరగదు. వారానికి 23 గంటలు మెస్సేజీలు పంపుతున్నాడు. ప్రతి ముగ్గురిలో ఒకరు డ్రైవ్ చేస్తున్నప్పుడు ఫోను మాట్లాడడం లేదా మెస్సేజీ చేయడం జరుగుతోంది. ఇంటర్నెట్ లేకు ండా ఐదుగంటలకు మించి బతకలేని స్థితిలో సగం మంది ఉన్నారు. 95 శాతం మొబైల్ వ్యసనానికి గురైన భారతీయులకు వారి మొబైల్ వారి జీవితం. ఎయిమ్స్ భోపాల్, ఐఐటి కాన్పూర్ నిపుణుల ప్రకారం ప్రపంచంలోని సెల్ఫీ చావుల్లో 50 శాతం ఇండియాలోనే చోటు చేసుకుంటున్నాయి. టూ రిస్టు ప్రదేశాల్లో నో సెల్ఫీ నిషిద్ధ జోన్లు ప్రకటించడం, ముఖ్య ంగా జలవనరులు, కొండశిఖరాలు, ఎత్తయిన భవనాలపై నో సెల్ఫీ నిషిద్ధ జోన్లు ప్రకటించడం అవసరం.అందమైన ఎర్రచీర, కొంగు తలపై కప్పుకుని, గాలికి ఎగిరిపోతున్న కొంగును ఒక చేత్తో పట్టుకుని, మరో చేత్తో సెల్ఫీ తీసుకునే ప్రయత్నంలో ఉంది. కొత్తగా పెళ్ళయిన 20 సంవత్సరాల అమ్మాయి. తన సంతోషమంతా ఒక సెల్ఫీలో బంధించిన ఫోటో అది. కాని .. దురదృష్టమేమిటంటే… అదే ఆమె చివరి ఫోటోఆమె పేరు రూపాలీ శర్మ తన భర్తతో కలిసి మధ్యప్రదేశ్ లోని మండలేశ్వర్ బ్రిడ్జిపై దంపతులిద్దరు సరదాగా సెల్ఫీలు తీసుకుంటున్నారు. అకస్మాత్తు గా, ఆమె బ్రిడ్జిపై నుంచి, ఆ పిట్టగోడ నుంచి తూలి నర్మదా నదిలో పడిపోయింది. ఒక్క క్షణం… కాస్త ఏమరుపాటు ఆమె ప్రాణాలు తీసుకుంది. అందమైన సెల్ఫీ కోసం ప్రయత్నం అందమైన జీవితాన్ని ముగించిందిమండలేశ్వర్ బ్రిడ్జిపై ఆ సంఘటన జరిగిన ప్రదేశానికి 300 కి.మీ.దూరంలో, మాందసోర్ లో ఇలాంటిదే మరో విషాదం. తల్లీకూతుళ్ళిద్దరు నీటిలో పడి మరణించారు. వాళ్ళు కూడా సెల్పీలు తీసుకునే ప్రయత్నంలో జారి నీళ్ళల్లో పడిపోయారు. ఈ రెండు ఇటీవల జరిగిన సంఘటనలు. ఇలాంటి సంఘటనలు ఎన్నెన్నో ఉన్నాయి. ప్రపంచంలో సెల్ఫీ చావుల రాజధానిగా మారుతున్న భారతావనిలో ఇలాంటి సంఘటనలు లెక్కలేనన్ని. ఇవి కేవలం సెల్ఫీ చావులు మాత్రమే కాదు. ప్రపంచంలో డిజిటల్ విప్లవం వచ్చింది. అరచేతిలో ప్రప ంచం ఇమిడిపోయింది.అద్భుతమైన లోకమిది. కాని ఈ డిజిటల్ విప్లవం భారతదేశంలో అవాంఛనీయమైన పరిణామాలకు కారణమయ్యింది. సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం, మనిషి ప్రవర్తన ఈ రెంటి మధ్య ఇక్కడ ఒక విచిత్రమైన సంబంధం కనబడుతోం ది. వీడియో షేరింగ్ యాప్ టిక్ టాక్ వచ్చిన తర్వాత యువతరం ఇంటర్నెట్ వ్యసనంలో మరింత కూరుకుపోతున్నారు. బీహారులో, పశ్చిమబెంగాల్లో ఇద్దరు సాహసకృత్యాల వీడియో తీసుకునే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయారు. పరిస్థితి ఎంత దిగజారిందంటే, మహారాష్ట్రలో ఒక కుర్రాడు వీడియో గేమ్ ఆడడానికి ఫోను ఇవ్వమని సోదరుడిని అడిగాడు. ఇవ్వలేదన్న కోపంతో కత్తితో పొడిచాడు. రాజస్థాన్ లో ఒక 60 సంవత్సరాల వృద్ధుడు జేబులో ఫోను పెట్టుకుని రాత్రి నిద్రపోయాడు. కాని మర్నాటి సూర్యోదయం చూడలేకపోయాడు.జేబులో ఫోను పేలిపోయి ప్రాణాలు వదిలాడు. ఢిల్లీలో ఒక వ్యక్తి మొబైల్ లో మాట్లాడుతూ కారు నడుపుతున్నాడు. తన మేనల్లుడిని కారుతో నుజ్జు నుజ్జు చేసిన విషయం కూడా అత ను గుర్తించలేదు. ఝార్ఖండ్ లో ఒక వాట్సప్ మె స్సేజి ఒక ఊళ్ళో ప్రజలను ఉన్మాదులుగా మార్చిం ది. అబద్దపు వార్త వాట్సప్ మెస్సేజి ద్వారా ప్రచారంలోకి రావడంతో వెర్రెత్తిపోయిన జనం మూకోన్మాదంతో దాడులకు పాల్పడ్డారు. ఒక అమాయకుడి ప్రాణాలు తీశారు. ఉత్తరప్రదేశ్ లో ఒక సామూహిక అత్యాచారాన్ని మొబైల్ ఫోనుతో వీడియో తీసి వంద రూపాయలకు అమ్ముతున్న సంఘటన వెలుగుచూసింది. ఇప్పుడు నిజమైన ప్రపంచండిజిటల్ ప్రపంచం మధ్య తేడా చెరిగిపోతోంది. స్క్రీన్ కే కళ్ళు అతుక్కుపోతున్నాయి. డిస్ ప్లే, స్క్రీన్, క్లిక్, ట్యాప్, ఇమెజీ, లైక్స్ … ఇవే మనుషుల మధ్య సంభాషణలుగా మారిపోయాయి. డిజిటల్ సంభాషణలే నిజమైన సంభాషణలైపోతున్నాయి. ఇప్పుడు ఇంటర్నెట్ వ్య సనం అనేది కొత్త వ్యసనంగా మారింది.డిజిటల్ సాధనాల పట్ల అసహజమైన, అసాధారణమైన అనుబంధం పెరిగిపోతోంది. కాని ఈ వ్యసనాన్ని సమాజం గుర్తించినట్లు కనబడడం లేదు. జాతీయ సర్వేల్లో ఈ వ్యసనం గురించి పరిశోధన, అధ్యయనాలేవీ జరగడం లేదు. ఇది ఇండియాలో పరిస్థితి. కాని ఇతర దేశాల్లో పరిస్థితి ఇలా లేదు. చైనా, దక్షి ణ కొరియా, జపాన్ దేశాలు ఇంటర్నెట్ వ్యసనం ప్రజారోగ్యానికి సంబంధించిన తీవ్రమైన సమస్య గా గుర్తించాయి. మే 2019లో ఆన్ లైన్ గేమింగ్ వ్యసనం, లేదా ఆన్ లైన్ గేమ్స్ కోసం అనారోగ్యకరమైన కోరిక కలిగి ఉండడం ఒక రుగ్మతగా, ఒక వ్యాధిగా గుర్తించారు. ఇది గేంబ్లింగ్ వ్యసనం వంటిదేనని నిర్ధారించారు. ఈ నిర్ధారణ చేసింది స్వయంగా ప్రపంచ ఆరోగ్య సం స్థ. కాని, ”డిజిటల్ వ్యసనాలు, రుగ్మతలను భారతదేశంలో గుర్తించడం లేదని“ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యసంస్థ సైకియాట్రీ విభాగం అధిపతి డా.రాజేష్ సాగర్ అన్నారు. కాని ఇది భారతదేశంలో సరికొత్త లైఫ్ స్టయిల్ రుగ్మతగా ఇప్పుడు సవాళ్ళు విసురుతోంది.సమాజంలో అనేక సామాజిక ఆర్ధిక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజల ఆరోగ్యస్పృహ, వారి ప్రవర్తన ఎలా ఉన్నాయన్నది గమనించవలసిన విషయం. మార్కెట్ రిసెర్చర్ కార్వీ దేశవ్యాప్తంగా తొమ్మిది నగరాల్లో సర్వే నిర్వహించింది. ఢిల్లీ, లక్నో, ముంబయి, ఇండోర్, కలకత్తా, పాట్న, చెన్నై, బెంగుళూరు, విజయవాడ నగరాల్లో 1648 మందిని ప్రశ్నించడం జరిగింది. సర్వేలో పాల్గొన్నవారు 18 నుంచి 55 సంవత్సరాల లోపు వయసు వారు. ఆరోగ్యం, జబ్బుల గురించి వారు ఎలాంటి వైఖరి కలిగి ఉన్నారో తెలుసుకునే ప్రయత్నం జరిగింది. సర్వేలో పాల్గొన్నవారిలో 70 శాతం మంది ఎగ్జిక్యూటివులు, బిజినెస్ చేస్తున్నవారు, అందరూ గ్రాడ్యుయేషన్ ఆపై స్థాయి చదువుకున్నవారు. చాలా మంది తమకు డిజిటల్ పరికరాలతో అసాధారణ అనుబంధం ఉందన్నది గుర్తిస్తున్నారు. మొబైల్ ఫోన్లతో చాలా సమయం గడుపుతున్నామని 47 శాతం ఒప్పుకుంటున్నారు.చివరకు భోంచేస్తున్నప్పుడు కూడా మొబైల్ ఫోనుతోనే గడుపుతున్నామని 62 శాతం మంది చెప్పారు. అంతేకాదు, ప్రతి ఐదుగురిలో ఒకరు సోషల్ మీడియా అత్యధికంగా ఉపయోగించడం వల్ల అలిసిపోతున్నామని కూడా అన్నారు. కంప్యూటర్ల ముందు, స్మార్ట్ ఫోనుల ముందు లేదా టాబ్లెట్ల ముందు రోజుకు 7 నుంచి 10 గంటలు అతుక్కుపోయి గడిపేస్తున్నారు. ఫలితంగా నడుంనొప్పి ఇతర సమస్యలు. ప్రతి తొమ్మి ది మందిలో ఒకరు పెయిన్ కిల్లర్స్ తీసుకునే పరిస్థితి వస్తోంది. డిప్రెషన్, యాంగ్జయిటీ, ఆగ్రహం, అపరాధభావాలకు దాదాపు 28 శాతం గురవుతున్నారు. మూసిన పడకగది తలుపుల వెనుక ఇబ్బందికరమైన రహస్యాలు … సెక్స్ గురించి ఆలోచించే సమయం కూడా తమకు లేదని, సెక్స్ లో పాల్గొనడం లేదని, సెక్స్ అంటే బోర్ కొడుతుందని 64 శాతం అన్నారు.ఈ అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వ్యసనంగా మారే విషయమై ప్రశ్నించినప్పుడు 45 శాతం మంది మొబైల్ ఫోనుపై గడుపుతున్న సమయం తగ్గించాలని భావిస్తున్నట్లు చెప్పా రు.ఇప్పుడు బ్యాండ్ విడ్త్ చాలా సులభంగా అందుబాటులోకి వచ్చింది. డాటా ప్లాన్లు చాలా చౌకగా దొరుకుతున్నాయి. ప్రభుత్వ కార్యక్రమాల వల్ల చైతన్యం కూడా పెరుగుతుంది. అవగాహన కూడా పెరుగుతోంది. ఇప్పుడు భారతదేశంలో డిజిటల్ జనాభా పెరిగింది. ఎనలిటిక్స్ కంపెనీ కామ్ స్కోర్ ప్రకారం 2018లో దేశంలో డిజిటల్ సాంకేతికతను వాడే వారి సంఖ్య చాలా పెరిగింది. పొద్దున్నే గుడ్ మాణింగ్ సందేశాలతో ఇతరుల ఫోన్లో ఇన్ బాక్సు నింపేయడం మనదేశంలోనే ఎక్కువ. మొ బైల్ ఫోను ద్వారా మాత్రమే సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఏడాదికి 3000 నిమిషాల వరకు ఆన్ లైన్ లో గడుపుతున్నారు. భారతదేశంలో 119 కోట్ల మొబైల్ యూజర్లున్నారుభారతదేశం కొత్త సాంకేతిక పరిజ్ఞానానికి చేతులు చాచి ఆ హ్వానించింది. కాని ఈ సాంకేతికత వచ్చి న తర్వాత ప్రవర్తనల్లో వచ్చిన మార్పులు డాక్టర్లను ఆందోళనకు గురిచేస్తున్నాయి. యాంగ్జయిటీ, చి కాకు, నిద్రలేకపోవడం, ముఖ్యమైన పనులు నిర్ల క్ష్యం చేయడం, కుటుంబ సభ్యులతో, మిత్రులతో, ముఖాముఖి సంభాషణలను తప్పించుకోవడం, సన్నిహిత బంధువులకు దూరం కావడం ఎక్కువవుతోంది. ఈ సమస్య కు గురిఅయిన చాలా మందికి తమకు సమస్య ఉంద ని తెలియదు. చాలా మంది దీనికి చికిత్స అవసరమని గుర్తించడం లేదు. క్లినికల్ సైకాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ డా. మనోజ్ కుమార్ శర్మ దీనిపై ఆందోళన వ్యక్తం చేశారు. నిమ్ హాన్స్ లో ఈ వ్యసనం తగ్గించే డిటాక్స్ సెంటరును ఆయన ఏర్పాటు చేశారు. దాని పేరు షట్ క్లినిక్ అంటే, సర్వీస్ ఫర్ హెల్దీ యూజ్ ఆఫ్ టెక్నాలజీ. ఈ రుగ్మతలు అంత తీవ్రంగా కనిపించవు. పనితీరుపై పెద్దగా ప్రభావం ఉండదు. కాని ఈ సమస్య తీవ్రమైతే మాత్రం చాలా విధ్వంసకరంగా మారవచ్చు.మనిషిలో నిర్ణయాలు తీసుకునే శక్తి చచ్చిపోతుంది. తనపై అదుపు పోతుంది. చిత్రవిచిత్రమైన వార్తలు ఇప్పుడు వస్తున్నాయి. ముంబయి లో ఒక కాలేజీ విద్యార్థి ఒక అమ్మాయికి రోజుకు 150 ఫోన్లు 64 వేర్వేరు నెంబర్లతో చేశాడు. ఢిల్లీలో ఒక భార్య అర్థరాత్రి వరకు చాటింగ్ లో ఉంటుందని భర్త విడాకులు కోరాడు. బెంగళూరులో ఒక యువకుడు రోజుకు 10 గంటలు నెట్ ఫ్లిక్స్ వీడియోలు చూసే వ్యసనానికి గురయ్యాడు. డాక్టర్ల ముందు తల్లిదండ్రులు ఇప్పుడు క్యూ కడుతున్నారు. పిల్లల చదువులు పాడవుతున్నాయని, ప్రవర్తనలో అకస్మాత్తుగా మార్పు వస్తోందని, మిత్రులను, కుటుంబాన్ని దూరం చేస్తున్నారని, బయటకు వెళ్ళడం ఇష్టపడడం లేదని, తిండి నిద్రల మీద ధ్యాస లేదని ఇలా రకరకాలుగా తల్లిదండ్రులు తమ పిల్లల గురించి డాక్టర్ల ముందు చెప్పుకుంటున్నారు. ఎయిమ్స్, మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజి డాక్టర్లు యంగ్ ప్రొఫెషనల్స్ లో, కాలేజీ విద్యార్థుల్లో మొబైల్ వాడకం ఒక జబ్బుగా 56 శాతంమందిలో ఉందని గుర్తించారు.ఇప్పుడు కొత్త జబ్బులు ముందుకు వస్తున్నాయి. ఇందులో అన్నింటికన్నా ముందు చెప్పుకోవసింది నోమోఫోబియా. అంటే మొబైల్ ఫోను ఉండదేమో అనే భయం. ఫోను మోగకపోయినా సరే ఫోను మోగుతున్నట్లు అనిపిస్తుంటుంది. ఇలాంటిదే మ రో వ్యాధి టెక్స్టాఫ్రేనియా, ఈ వ్యాధిలో మొబైల్ ఫోనులో మెస్సేజి రాకపోయినా వచ్చినట్లు అనిపిస్తుంది. మరోవ్యాధి టెక్సయిటి, అంటే మెస్సేజిలు రాకుండా, పంపకుండా కాసేపు ఉండలేకపోవడ ం. ఇవేమీ అరుదైన జబ్బులు కావు. చాలా మందిలో ఉన్నాయి. కాని ఉన్నట్లు తెలియదు. ఇండోర్ ఎంజిఎం మెడికల్ కాలేజిలో కమ్యునిటీ మెడిసిన్ అధిపతి డా.సంజయ్ దీక్షిత్ 2009లో భారతదేశంలో మొదటిసారి సెల్ ఫోన్ వ్యసనంపై అధ్యయనం నిర్వహించారు. 150 మంది మెడికల్ స్టూడెంట్స్ పై జరిగిన సర్వేలో ప్రతి పదిమందిలో 9 మందికి ఏదో ఒక రుగ్మత ఇలాంటిది ఉంది. ఇందులో 56 శాతం మంది తమ శరీరానికి దగ్గరగా మొబైల్ ఫోను ఉండాలని గట్టిగా కోరుకునేవారు. సాధారణ అసంతృప్తి, అభద్రత, ఒత్తిడి, అలసట, నిద్రలేకపోవడం వగైరా లక్షణాలు ఎలా ఫోమో రుగ్మతకు సంబంధించినవో జిబిల్ స్కీ వివరించారు. ఫోమో బాధితులు ఎలా సాంఘిక సంబంధాల్లో చాటుమాటు గా వ్యవహరిస్తారో చాలా మంది ఇతరులు కూడా వివరించారు. తాము చాలా సంతోషంగా ఉన్నట్లు పైకి అందరికీ కనిపించేలా వ్యవహరిస్తుంటారు. చివరకు కొందరు సోషల్ నెట్‌వర్క్ లో ఫేక్ మిత్రు ల కోసం ఖర్చు పెట్టి ఫ్రండ్స్ ను, ఫాలోవర్స్ ను కూడా కొంటారు. ఇలాంటి అసూయకు సంబంధి ంచిన మరో రుగ్మత ఫోబో అంటే ఫియర్ ఆఫ్ బెట ర్ ఆప్షన్స్. మెరుగైన ప్రత్యామ్నాయాల భయం. ఇంకోటి ఫోడా అంటే ఫియర్ ఆఫ్ డూయింగ్ ఎనీ థింగ్. ఏదన్నా చేస్తామేమో అనే భయం. మోమో అంటే మిస్టరీ ఆఫ్ మిస్సింగ్ ఔట్, కోల్పోతామనే ఒత్తిడి. ఫోడో అంటే ఫియర్ ఆఫ్ డిసప్పాయింటిం గ్ అదర్స్. అంటే ఇతరులకు నిరాశ కలిగిస్తామే మో అనే భయం.మరో ఆసక్తికరమైన విషయమేమంటే, ఆన్ లైన్ లో ఫేక్ వార్తలు, అబద్ధాలు పెరిగిపోయి, జనంలో ఆగ్రహావేశాలు పెరుగుతున్న నేపథ్యంలో, చివరకు మూకహత్యలకు ఫేక్ వార్త లు కారణమైన నేపథ్యంలో ఫోమో రుగ్మతకు ఆన్ లైన్ ఫేక్ వార్తలకు సంబంధం ఉందని తేలింది. ముంబయిలోని సోమయ్య ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజిమెంట్ స్టడీస్ లో అసోసియేట్ ప్రొఫెసర్ షాలిని తల్వార్ తదితరులు ఫేక్ వార్తలపై రిసెర్చ్ చేశారు. వార్త నిజమో కాదో తెలుసుకోకుండా ఎందుకు ఫార్వార్డ్ చేస్తున్నారనే విషయంపై దృష్టి పెట్టారు. రిటైల్ అండ్ కన్సూమర్ సర్వీసెస్ లో జులై నెలలో ఈ వివరాలు వచ్చాయి. మిస్సింగ్ ఔట్.. తాము మిస్సయిపోతామన్న భయం వల్ల జనించే నిర్లక్ష్యంతో ఇలాంటి ఫేక్ వార్తలను ఫార్వార్డ్ చేస్తారని తెలిసింది. స్క్రీన్ టైం.. అంటే తెరను చూస్తూ గడిపే సమయం ఒక వ్యసనంగా మారింది. గేమింగ్ యాప్స్ లేదా సోషల్ మీడియా ఇప్పుడు 15 నుంచి 24 సంవత్సరాల మధ్య వయసువారిలో చాలా పెరిగిపోయింది. కలకత్తాకు చెందిన డా.అనిరుధ్ దేవ్ ఈ విషయమై ఆందోళన వ్యక్తం చేశారు. సైబర్ క్రాండియా వ్యాధికి గురయిన యువత ఆ యన వద్దకు చాలా మంది వస్తున్నారు.ఈ వ్యాధి ఏమిటంటే, అంతుతెలియని లక్షణాలకు, చిన్నా చితక లక్షణాలకు సంబంధించి ఇంటర్‌నెట్ లో మెడికల్ సమాచారం కోసం వెదికి వెదికి చివరకు తమకేదో జబ్బు వచ్చిందనుకుని డాక్టరు దగ్గరకు వెళ్ళడం. టెక్నాలజీ వ్యసనం చీకటి కోణాలు గత కొన్ని సంవత్సరాలుగా యువతను వేధిస్తున్నాయి. బెదిరింపులు, లైంగిక వికృతచేష్టలు, హింస, ఆన్ లైన్ గేమ్స్ ఒక వికృతమైన వాస్తవాన్ని ముందుకు తెస్తున్నాయి. 2017లో మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్, తెలంగాణా, కేరళ రాష్ట్రాల్లో టీనేజర్లు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. బ్లూవేల్ ఛాలెంజ్.. ఆన్ లైన్ సూయిసైడల్ గేమ్ దీనికి కారణం. ఈ గేమ్ స్కూళ్ళలో, తల్లిదండ్రుల్లో ఒక హిస్టీరియాను సృష్టించింది. కాని ఇంటర్నెట్ చీకటి లోయల్లో ఇది ఒక్కటే కాదు. ఇలాంటివి చాలా ఉన్నాయి.డిజిటల్ సమస్యల జాబితా రోజు రోజుకు పెరుగుతోంది. టెక్నోఫరెన్స్ అంటే టెక్నాలజీ వల్ల డిజిటల్ ప్రవర్తన వాస్తవ సంబంధాల్లో జోక్యం చేసుకుని సంబంధాలను దెబ్బతీయడం, తీరిక సమయాలను తినేయడం, వాస్తవ సంభాషణలు లేకుండా చేయడం, చివరకు సెక్స్ లైఫ్ కూడా లేకుండా చేయడం జరుగుతుంది. గూగుల్ ప్రభావం కూడా ఉంది. మనం చాలా విషయాలను ఇప్పుడు మరిచిపోతున్నాం. ఎందుకంటే, ఏదైనా ఒక క్లిక్ చేస్తే చాలు మన ముందుకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి గుర్తుంచుకోవడం లేదు. మరొక ముఖ్యమైన విషయం ట్రూమన్ షో భ్రమ. తాను చాలా స్పెషల్ అనే భావనతో తనకు అన్యాయం జరిగిపోతుందని బాధపడిపోవడం. అత్యధికంగా ఆన్ లైన్ లో కనెక్ట్ అయి ఉండి గడిపేవారికి, సోషల్ మీడియా, రియాలిటీ షోల భ్రమల్లో బతికేవారిలో ఈ రుగ్మత చోటు చేసుకుంటోంది. టెక్నాలజీ వల్ల వచ్చే వైకల్యాలు కూడా ఉన్నాయి. టెకస్ట్ క్లా అనేది అధికారికంగా మెడికల్ డయాగ్నసిస్ కాదు. కాని మణికట్టు, చేతుల్లో చాలా మంది టెక్నాలజీ వాడే వారిలో తీవ్రమైన నొప్పులు మొదలవుతున్నాయి. సెల్ఫీ ఎల్బో, టెక్స్టింగ్ థంబ్ వంటివి మరికొన్ని వైకల్యాలు.
No comments:
Post a Comment