Breaking News

10/09/2019

కమల్ నాధ్ కేసులు తవ్వుతున్నారు

భోపాల్, సెప్టెంబర్ 10, (way2newstv.in)
ఓ వైపు బీజేపీ తమ నాయకులను ఇబ్బందులకు గురి చేస్తుందంటూ కాంగ్రెస్ ఆరోపిస్తుంది. అయితే అదేం లేదు అంటూ బీజేపీ కొట్టి పడేస్తుంది. మరోవైపు మాత్రం కాంగ్రెస్ నాయకులపైన మాత్రం ఎప్పటివో కేసులు కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్ కు ఇబ్బందులు తప్పేలా లేవు. బ్యాంకు కుంభకోణం కేసులో అల్లుడు రతుల్  పురిని అరెస్ట్ చేయగా.. ఇప్పుడు 24ఏళ్ల నాటి కేసులో సీఎం కమల్ నాథ్ కు ఇబ్బందులు తప్పేలా లేవు.1984 లో ఢిల్లీలో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్ల సమయంలో కమల్ నాథ్ పేరును కేసులో పెట్టగా ఆ కేసును త్వరలో తిరిగి తెరిచేందుకు సిద్ధం అవుతుంది కేంద్ర హోంశాఖ.
కమల్ నాధ్ కేసులు తవ్వుతున్నారు

ఈ మేరకు అమిత్ షా నేతృత్వంలోని హోం మంత్రిత్వ శాఖ నుండి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చేసింది.అగస్టా వెస్ట్‌ల్యాండ్ కేసుకు సంబంధించి కమల్ నాథ్ మేనల్లుడు రతుల్ పూరిని అరెస్టు చేసిన కొద్ది రోజులకే కేంద్ర హోంశాఖ నిర్ణయం రావడం విశేషం. గత నెలలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరంను కూడా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే కమల్ నాథ్ కేసును తిరగతోడుతున్నారు.అయితే మరోవైపు సీఎం కమల్ నాథ్ ఢిల్లీ అల్లర్లలో తన పాత్రను ఖండించారు. కమల్ నాథ్ ఢిల్లీ నాయకులు జగదీష్ టైట్లర్ మరియు సజ్జన్ కుమార్లతో కలిసి 1984లో అల్లర్లకు జనాన్ని ప్రేరేపించారనినే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. ఢిల్లీలోని రాకాబ్‌గంజ్ గురుద్వారా దగ్గర కమల్ నాథ్ ఒక గ్రూపుకు నాయకత్వం వహించినట్లుగా ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.

No comments:

Post a Comment