Breaking News

10/09/2019

శ్రీశైలం డ్యామ్ క్రెస్ట్ గేట్స్ ఎత్తి నీటి విడుదల

కర్నూలు సెప్టెంబర్ 10, (way2newstv.in)
ఎగువ పరివాహక ప్రాంతాలలో భారీగా వరద నీరు వచ్చి చేరడంతో శ్రీశైలం ఇన్ఫ్లో ఎక్కువగా ఉండడంతో శ్రీశైలంలోని డ్యామ్ 4 గేట్లను అధికారులు ఎత్తి దిగువ  నాగార్జునసాగర్ జలాశయాలకు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం డ్యామ్ కు  భారీగా వరద నీరు చేరుతుండడంతో ఈ గేట్లను ఒక్కకోకటిగా తెరచి వచ్చిన ఇన్ఫ్లో వచ్చినట్లుగా పంపిస్తున్నారు ప్రస్తుతం శ్రీశైలం డ్యామ్ నందు 3,53,475 ఇన్ ఫ్లో  వస్తూ ఉండగా 3,25,049 క్యూసెక్కులవరద శ్రీశైలం డ్యామ్ కు వచ్చి చేరుతుంది.వచ్చిన వరద నీటిని 4 క్రెస్ట్ గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 1,08,076 క్యూసెక్కులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 
శ్రీశైలం డ్యామ్ క్రెస్ట్ గేట్స్ ఎత్తి నీటి విడుదల

అలాగే ఎగువ ప్రాంతాలైన మహాత్మాగాంధి కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 2400 క్యూసెక్కులు అలాగే మల్యాల హంద్రీనీవా సుజల స్రవంతి కి 2026, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 24,500 క్యూసెక్కుల వరద నీటిని కుడా విడుదల చేస్తూ మొత్తం మీద 1,80,121  కూసెక్కుల వరద నీటిని దిగువ నాగార్జున సాగర్ కు నీటివిడుదల చేస్తున్నారు. ప్రస్తుతం డ్యామ్ నందు గరిష్ట నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884.50 అడుగులకు చేరుకుంది అలాగే యొక్క నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా ప్రస్తుతం 212.9198 టీఎంసీల నీటి నిల్వలు కొనసాగుతున్నాయి ఏది ఏమైనప్పటికీ  ఈ సంవత్సరం లో రెండవసారి శ్రీశైలం క్రెస్టు గేట్లు తెరుచుకోవడం శుభ పరిణామం అలాగే నాగార్జునసాగర్ జలాశయాలకు కూడా పెద్దఎత్తున వరద నీరు చేరుతుండడంతో రాష్ట్ర ప్రజలు వరద నీటితో రైతాంగం పంటలు విస్తారంగా పండి  తెలుగు రాష్ట్రాలు సుఖశాంతులతో తులతూగాలని అధికారులు రాజకీయ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

No comments:

Post a Comment