Breaking News

25/09/2019

త్రిముఖ పోరులో హూజూర్ నగర్

నల్గొండ, సెప్టెంబర్ 25, (way2newstv.in)
తెలంగాణలో జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో హుజుర్ నగర్ స్థానం నుంచి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అదే క్రమంలో ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అటు నల్గొండ ఎంపీగా కూడా విజయం సాధించారు. దాంతో ఎంపీగా కొనసాగడానికి సిద్ధమైన ఉత్తమ్.. హుజుర్ నగర్ ఎమ్మెల్యేగా రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో అక్కడ ఎన్నిక అనివార్యమైంది.తెలంగాణలో హుజూర్ నగర్ ఉప ఎన్నిక అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. తెలంగాణలో రోజు రోజుకు కాంగ్రెస్ బలహీనమవుతోంది. ఈ తరుణంలో సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్ విశ్వప్రయత్నం చేస్తోంది. ఇది కాంగ్రెస్ కు సవాలుగా మారింది. 
త్రిముఖ పోరులో హూజూర్ నగర్

మరో వైపు తెలంగాణలో బీజేపీ లేదంటూ విస్రృత ప్రచారం చేస్తోంది టి.ఆర్.ఎస్. కాని తెలంగాణలో బీజేపీ ఉందని అందుకే నాలుగు పార్లమెంటు సీట్లలో పాగావేశామని చెబుతున్నారు కాషాయ నేతలు. అప్పుడు కాదు ఇప్పుడు చూపండి మీ తడఖా అంటూ టి.ఆర్.ఎస్ నాయకులు సవాలు విసురుతున్నారు. గత ఎన్నికల్లో బీజేపీ కి నోటా కంటే కూడా తక్కువ ఓట్లు వచ్చాయని ఎద్దేవా చేస్తోంది. ఇక టీఆర్ఎస్ మాత్రం హుజూర్ నగర్ లో కారు గెలిస్తేనే అభివృద్ధి ఉంటుందంటూ ప్రచారం మొదలెట్టింది. ఇంతకీ ఈ త్రిముఖ పోరు ఎలా ఉండబోతోంది….?తెలంగాణలో హుజూర్ నగర్ ఉప పోరుకు తెరలేచింది. ఈ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ కూడా విడుదల కావడంతో… అన్ని పార్టీలు తమ అభ్యర్థులతో నామినేషన్ వేయించేందుకు సిద్ధమవుతున్నాయి. కాంగ్రెస్ తరపున ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య, మాజీ ఎమ్మెల్యే పద్మావతి ఇక్కడి నుంచి పోటీ చేయడం  ఖాయమయింది. ఇక టీఆర్ఎస్ తరపున సైదిరెడ్డి బరిలో ఉండనున్నారు. బీజేపీ తరపున శ్రీకళా రెడ్డి ఖరారయ్యారు.హుజూర్ నగర్‌ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా శ్రీకళారెడ్డి ఎంపిక దాదాపు ఖరారయింది. అభ్యర్థి ఎంపికపై సమావేశమైన రాష్ట్ర కోర్ కమిటీ… ఈ అంశంపై దాదాపు గంటన్నరకు పైగా చర్చించింది. హుజూర్ నగర్ బరిలో పార్టీ తరపున ఎవరిని బరిలో నిలపాలనే దానిపై బీజేపీ సుదీర్ఘంగా చర్చించింది. శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ, 2008 ఎన్నికల్లో పోటీ చేసిన భాగ్యారెడ్డితో పాటు శ్రీకళారెడ్డి పేర్లు చర్చకు వచ్చాయని సమాచారం. అయితే వీరిలో ఎక్కువమంది నేతలు శ్రీకళారెడ్డి వైపు మొగ్గుచూపడంతో ఆమెనే ఖరారు చేశారు.హుజూర్‌నగర్‌లో కాంగ్రెస్ గెలిచినా, బీజేపీ గెలిచినా ప్రయోజనం ఏమీ ఉండదని కేటీఆర్ జనాల్లోకి వెళ్లిపోతున్నారు. కాంగ్రెస్ వద్దు… బీజేపీ లేదు… హుజూర్ నగర్ మాదేనన్న కేటీఆర్. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో ఈ సారి టీఆర్ఎస్‌దే విజయమని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. నల్లగొండలో జరిగిన కార్యకర్తలు, ముఖ్యనేతల సమావేశంలో హుజూర్ నగర్ పై ప్రచారం మొదలెట్టేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డిని గెలిపించుకోవడం ద్వారా హుజూర్ నగర్‌ను మరింతగా అభివృద్ధి చేసుకుందామని పార్టీ శ్రేణులకు, ప్రజలకు పిలుపునిచ్చారు కేటీఆర్.ఇలా మూడు పార్టీలు హుజూర్ నగర్లో తామంటే తామంటూ చెబుతున్నారు. మరి విజయం సాధించేదెవరో ఫలితాల వరకు వేచిచూడాల్సిందే.

No comments:

Post a Comment