Breaking News

25/09/2019

మఠాఠ పోరులో కింగ్ ఎవరు...

మహారాష్ట్ర, సెప్టెంబర్ 25, (way2newstv.in)
మహారాష్ట్ర ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ప్రతి పార్టీ సెంటిమెంట్ తో ప్రజలను తమ వైపు మలచుకునేందుకు ప్రయత్నిస్తోంది. సెంటిమెంట్ నే ఓటు బ్యాంకుగా మలచుకోవాలని ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. మహారాష్ట్రలో ఈసారి సత్తా చాటాలని ప్రతి ఒక్క పార్టీ భావించడం సహజమే. అయితే తమ మ్యానిఫేస్టోలో ప్రజలను ఆకర్షించే పథకాలను పెట్టడం, హామీలను ఇచ్చి విజయం సాధించడం ఒకరకమైన స్ట్రాటజీ. కానీ సెంటిమెంట్ ను రంగరించి, ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి ఓట్లను సంపాదించుకోవడం ఇప్పుడు మహారాష్ట్రలో సాధారణమయింది. దీనికి ఎవరూ అతీతులు కారు.భారతీయ జనతా పార్టీ హిందూ ఓటు బ్యాంకు పైనే ఆధారపడి ఉంటుంది. 
మఠాఠ పోరులో కింగ్ ఎవరు...

గత ఐదేళ్ల నుంచి అధికారంలో ఉన్న బీజేపీ ఎన్నికలు దగ్గరపడే సమయంలో ప్రజలకు హామీలతో పాటు కొన్ని సెంటిమెంట్లను కూడా రాజేసింది. మరాఠాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకోవడం ఇందులో భాగమే. అత్యధికశాతం మరాఠాలున్న ఆ ప్రాంతంలో రిజర్వేషన్ల ప్రభావం తమకు రానున్న ఎన్నికల్లో ఎంతగానో ఉపయోగపడుతుందన్నది బీజేపీ అంచనా. రిజర్వేషన్లతో పాటు ఎటూ ప్రతి నియోజకవర్గంలో హిందూ ఓటు బ్యాంకు ఉండనే ఉంది.ఇక మరో ముఖ్యమైన పార్టీ శివసేన. శివసేన ఉద్భవించిందే సెంటిమెంట్ మీద. హిందుత్వంతో పాటు లోకల్ నినాదం కూడా శివసేన అందుకుంటుంది. శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాక్రే సయితం లోకల్ నినాదాలతో ఎదిగారు. మరాఠేతరులను ముంబయి నుంచి పంపాలన్నఉద్యమాలను కూడా శివసేన గతంలో చేసింది. తండ్రి బాటలోనే ప్రస్తుతం ఉద్ధవ్ థాక్రే నడుస్తున్నారు. సంకీర్ణ భాగస్వామ్యంలో ఉన్నా మహారాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగితే శివసేన బీజేపీపైనా శివాలెత్తిన సంఘటనలు అనేకం ఉన్నాయి. అది పెద్దనోట్ల రద్దు కావచ్చు. జీఎస్టీ కావచ్చు. ఇలా స్థానికంగా బలపడేందుకు శివసేన కూడా సెంటిమెంట్ తోనే రాజకీయాలను నెట్టుకొస్తుంది.అాలాగే శివసేన నుంచి బయటకు వచ్చిన రాజ్ థాక్రేకూడా సెంటిమెంట్ తోనే గెలవాలనుకుంటారు. గతంలోనూ ఆయన మరాఠాల ఉద్యమాన్ని నడిపారు. పెట్రోలు ధరలు పెరిగినా ఆయన పుట్టిన రోజున ఉచితంగా పెట్రోలు పోయించడం వంటివి చేస్తారు. అయితే పార్టీ ఆవిర్భవించిన తర్వాత తొలిసారి జరిగిన ఎన్నికల్లో కొన్ని సీట్లు గెలిచిన తర్వాత జరిగిన ఎన్నికల్లో సత్తాచాట లేకపోయింది. ఇక తాజాగా ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రాజ్ థాక్రే కొత్త నినాదాన్ని ఎత్తుకున్నారు. మరాఠీ మాట్లాడే వారికే ఇల్లు విక్రయించాలని, మరాఠాలకే ఇల్లు అద్దెకు ఇవ్వాలన్న కొత్త నినాదాన్ని ఎంఎన్ఎస్ అందుకుంది. ముంబయిలో పెద్ద పెద్ద హోర్డింగ్ లు పెట్టి రాజ్ థాక్రే పార్టీ సంచలనాలకు తెరతీసింది.

No comments:

Post a Comment