Breaking News

21/09/2019

కళ్యాణలక్ష్మిలో అవినీతి లేదు

హైదరాబాద్ సెప్టెంబర్ 21, (way2newstv.in)
శనివారం ఉదయం తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి సభలో ముందుగా  ప్రశ్నోత్తరాలు కొనసాగాయి. కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల అమలుపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి గంగుల కమలాకర్ సమాధానం ఇచ్చారు. కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల ద్వారా పేదింటి ఆడపిల్లల వివాహాలకు ఆర్థిక సాయం అందిస్తున్నామని తెలిపారు. పేద తల్లిదండ్రులకు భారం దింపామని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి పథకం అమలు కావడం లేదు. 
కళ్యాణలక్ష్మిలో అవినీతి లేదు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన  కళ్యాణలక్ష్మి పథకం అమలులో ఎలాంటి అవినీతి జరగడం లేదని మంత్రి స్పష్టం చేశారు. పథకానికి సంబంధించిన డబ్బులు దశల వారీగా పెంచిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ ఆర్థిక సాయం సకాలంలో అందించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు. . ప్రభుత్వ అధికారులను భాగస్వాములు చేసినట్లు, పథకం పారదర్శకంగా కొనసాగుతోందన్నారు. కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ ఆలస్యం అవుతోందని సభ్యులు ప్రస్తావించారు. ఈ పథకం అమలులో ఆన్లైన్లో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. వాటిని పరిష్కరిస్తామన్నారు. బీసీల్లో ఎక్కువ డిమాండ్ ఉందని, బడ్జెట్లో రూ. 700 కోట్లు పెట్టడం జరిగిందన్నారు.   18 సంవత్సరాలు నిండిన వారికి మాత్రమే కల్యాణలక్ష్మి పథకం వర్తిస్తుంది. కల్యాణలళ్యా, షాదీముబారక్ పథకాల అమలుతో బాల్య వివాహాలు తగ్గాయని మంత్రి స్పష్టం చేశారు.

No comments:

Post a Comment