Breaking News

21/09/2019

మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల షెడ్యూల్ విడుదల

హుజూర్ నగర్ కు ఆక్టోబర్ 21 న ఎన్నికలు
న్యూఢిల్లీ సెప్టెంబర్ 21, (way2newstv.in)
మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరా ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేశారు. మహారాష్ట్రలో 288 సీట్లకు,హర్యానాలో 90 సీట్లకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు అయన సునీల్ ఆరోరా చెప్పారు. రెండు రాష్ట్రాల శాసనసభల ఎన్నికల షెడ్యూల్ విడుదల సందర్భంగా సిఇసి  శనివారంమీడియాతో మాట్లాడారు. మహారాష్ట్రలో 8.94 కోట్ల ఓటర్లు, హర్యానాలో 1.28 కోట్ల ఓటర్లు ఉన్నారని ఆయన చెప్పారు. 
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల షెడ్యూల్ విడుదల

నోటిఫికేషన్ విడుదల: సెప్టెంబర్ 27, నామినేషన్ల దాఖలుకుచివరి తేదీ: అక్టోబర్ 4,  నామినేషన్ల పరిశీలన: అక్టోబర్ 5, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ: అక్టోబర్ 7, పోలింగ్ తేదీ: అక్టోబర్ 21,  ఫలితాలు వెలువడే తేదీ: అక్టోబర్ 24.ఎన్నికల ప్రచారంలో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తున్నామని చెప్పారు. ఎన్నికల ఖర్చు పరిశీలనకు అబ్జర్వర్లను నియమిస్తామని తెలిపారు. ఒక్కో అభ్యర్థి రూ. 28 లక్షల వరకు మాత్రమేఖర్చు చేయాలని అయన  చెప్పారుతెలంగాణలోని హుజూర్ నగర్ ఉప ఎన్నికను అక్టోబర్ 21న నిర్వహించనున్నట్లు  సిఇసి సునీల్ అరోరా ప్రకటించారు. ఈ నెల 23న నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఆయన చెప్పారు.ఈనెల 30 వరకూ నామినేషన్లను స్వీకరిస్తారని, అక్టోబర్ 1వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుందని ఆయన అన్నారు. అక్టోబర్ 3లోగా నామినేషన్ల ఉపసంహరించుకోవచ్చుననిఆయన అన్నారు. 21న పోలింగ్,  24న కౌంటింగ్ జరుగుతుందని ఆయన చెప్పారు.

No comments:

Post a Comment