Breaking News

16/09/2019

ఆత్మహత్య చేసుకొన్న కోడెల

హైద్రాబాద్, సెప్టెంబర్ 16, (way2newstv.in)
అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద రావు (72) కన్నుమూశారు. సోమవారం ఉదయం హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆత్మహత్యకు యత్నించారు. వెంటనే స్పందించిన సహాయకులు.. ఆయన్ను బసవతారకం హాస్పిటల్‌కు తరలించారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆయన ఆత్మహత్యాయత్నం చేశారని సమాచారం. ఒత్తిడితోనే ఆయన ఆత్మహత్యకు యత్నించారని బంధువులు చెబుతున్నారు. ఆయన్ను హైదరాబాద్‌లోని బసవతారకం హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందించే ప్రయత్నం చేశారు. కానీ శ్వాస తీసుకోలేకపోవడంతో.. ఆయన తుదిశ్వాస విడిచారు.కోడెల శివ ప్రసాద రావుకు ఇటీవలే గుండె పోటు వచ్చిన సంగతి తెలిసిందే. 
ఆత్మహత్య చేసుకొన్న కోడెల

దీంతో గుంటూరులో కొద్ది రోజులపాటు తన అల్లుడికి చెందిన హాస్పిటల్లో ఆయన చికిత్స పొందారు. రెండు రోజుల క్రితమే ఆయన హైదరాబాద్ వచ్చినట్టు సమాచారం. వెంటిలేటర్ మీద ఉంచి చికిత్స అందించే ప్రయత్నం చేశారు. కానీ పరిస్థితి విషమించడంతో.. ఆయన తుది శ్వాస విడిచారు. కొడెల మరణ వార్తను హాస్పిటల్ వర్గాలు ఇంకా ధ్రువీకరించలేదు. కానీ బంధువులు, పార్టీ వర్గాలు మాత్రం ఆయన మరణవార్తను ధ్రువీకరించాయి. కోడెల పార్థీవ దేహాన్ని కాసేపట్లోనే నర్సరావు పేట తీసుకెళ్తారని సమాచారం.కోడెల శివ ప్రసాద రావుకు ఇటీవలే గుండె పోటు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో గుంటూరులో కొద్ది రోజులపాటు తన అల్లుడికి చెందిన హాస్పిటల్లో ఆయన చికిత్స పొందారు.అసెంబ్లీ ఫర్నీచర్ వివాదంలో పోలీసులు కోడెలపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. టీడీపీ హయాంలో కోడెల ట్యాక్స్ పేరిట నరసరావు పేట ప్రాంతంలో బలవంతంగా వసూళ్లు చేపట్టారని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయన కుమార్తె, కుమారుడిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ఆయన మానసిక వేదనకు గురయ్యారుకోడెల శివ ప్రసాద రావు మరణం పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు.

No comments:

Post a Comment