Breaking News

05/09/2019

మళ్లీ ఊరించి.... ఊసురుమనిపించిన కేసీఆర్

నెల తర్వాతే విస్తరణ
నల్గొండ, సెప్టెంబర్ 5, (way2newstv.in)
వారం రోజుల్లో మంత్రివర్గ విస్తరణ ఉండబోతుందని మీడియా చేసిన హడావుడి తుస్సుమంది. మంత్రి వర్గ విస్తరణ ఇప్పట్లో ఉండే అవకాశమే లేదని పాలకపక్షం టీఆర్‌ఎస్ వర్గాలు అంచన వేస్తున్నారు. మంత్రిమండలిలో ఖాళీగా ఉన్న ఆరు స్థానాలను త్వరలోనే భర్తీ కాబోతున్నాయని ఆశావాహులు, పార్టీ నేతలు, మీడియా వర్గాలు అంచనా వేశాయి. అయితే మంత్రివర్గ విస్తరణపై పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నుంచి ఎలాంటి సంకేతాలు లేవని పార్టీ ముఖ్య నేత ఒకరు అన్నారు. పైగా మంత్రివర్గ విస్తరణకు ప్రస్తుత పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా లేవని ఈ వర్గాలు కచ్చితంగా చెబుతున్నాయి. దసరా పండుగ లోగా మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉంటుందని పార్టీ నేతలతో పాటు రాజకీయ వర్గాలు అంచనా వేసిన విషయం తెలిసిందే. 
మళ్లీ ఊరించి.... ఊసురుమనిపించిన కేసీఆర్

అయితే మంత్రివర్గ విస్తరణకు కొన్ని అడ్డంకులు ఎదురైనట్టు ఈ వర్గాలు విశే్లషిస్తున్నాయి. శుక్రవారం నుంచి రాష్టవ్య్రాప్తంగా గ్రామాలలో 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు ప్రారంభమై ఆక్టోబర్ 6 వరకు కొనసాగనుంది. ఆ మరసటి రోజు అక్టోబర్ 7న దసరా పండుగ. అలాగే ఈ నెల 9 నుంచి శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. బడ్జెట్ సమావేశాలను 16 పని దినాలు కచ్చితంగా కొనసాగించాల్సి ఉంది. దీంతో శాసనసభ సమావేశాలు 9న ప్రారంభమయ్యాక మధ్యలో వచ్చే సాధారణ సెలవులతో పాటు మొహర్రం, వినాయక నిమజ్జనం సెలవులు రానున్నాయి. దీంతో ఈ సమావేశాలు ఈ నెలాఖరు వరకు కొనసాగే అవకాశం ఉంది. మరోవైపు మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ ఏ క్షణానైనా వెలువడే అవకాశం ఉంది. మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టులో వివిధ వర్గాలు వేసిన పిటిషన్లపై విచారణ పూర్తి కాగా తీర్పు కోర్టు రిజర్వు చేసింది. ఈ నేపథ్యంలో ఏ క్షణంలోనైనా మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సానుకూల తీర్పు వచ్చే అవకాశం ఉందని టీఆర్‌ఎస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. శాసనసభ బడ్జెట్ సమావేశాలు, 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక, పండుగల నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలు దసరా తర్వాతనే జరిగే అవకాశం ఉండటంతో ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణకు అవకాశం లేదని టీఆర్‌ఎస్ వర్గాలు విశే్లషిస్తున్నాయి. అయితే మంత్రివర్గ విస్తరణలో తమకు కచ్చితంగా అవకాశం ఉంటుందని ఆశిస్తున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు దసరా పండుగ లోగా మంత్రివర్గ విస్తరణకు అవకాశం ఉండకపోవచ్చనే సన్నిహితుల వద్ద అంతరంగిక సంభాషణాల్లో సంకేతాలు ఇచ్చినట్టు కూడా సమాచారం

No comments:

Post a Comment