Breaking News

20/09/2019

హైదరాబాద్‌లో సమావేశమయిన దక్షిణాది రాష్ట్రాల డీజీపీలు

హైదరాబాద్‌ సెప్టెంబర్ 20 (way2newstv.in)  
కేంద్ర హోంశాఖ ఆదేశాలతో దక్షిణాది రాష్ట్రాలకు చెందిన డీజీపీలు హైదరాబాద్‌లో శుక్రవారం సమావేశమయ్యారు. దేశ అంతర్గత భద్రతకు సంబంధించి రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం అందించుకోవడంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. శాంతి భద్రతలు, సైబర్ నేరాలు, మావోయిస్టులు, ఉగ్రవాదం, మాదకద్రవ్యాల రవాణా తదితర అంశాలపై ఆయా రాష్ట్రాల డీజీపీలు, ఉన్నతాధికారులు చర్చిస్తారు. 
హైదరాబాద్‌లో సమావేశమయిన దక్షిణాది రాష్ట్రాల డీజీపీలు

కేరళ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంద్రప్రదేశ్‌తో పాటు పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ పోలీస్ ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. తెలంగాణ నుంచి డీజీపీ మహేందర్‌రెడ్డితో పాటు అదనపు డీజీపీలు ఇతర ఉన్నతాధికారులు  ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశం అనంతరం హైదరాబాద్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను అధికారులు సందర్శించే అవకాశమున్నట్టు సమాచారం.

No comments:

Post a comment