Breaking News

20/09/2019

ప‌న్ను శాతం త‌గ్గింపు దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు పాజిటివ్ సంకేతం

కొనియాడిన ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంత్ దాస్
న్యూ డిల్లీ సెప్టెంబర్ 20  (way2newstv.in)
కార్పొరేట్ సంస్థ‌ల‌పై ప‌న్ను శాతం త‌గ్గించ‌డాన్ని ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంత్ దాస్ కొనియాడారు. ఇది సాహ‌సోపేత‌మైన చ‌ర్య అన్నారు. ఈ చ‌ర్య దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు పాజిటివ్ సంకేతాన్నిఇస్తుంద‌న్నారు. కార్పొరేట్ ప‌న్నును త‌గ్గించ‌డాన్ని స్వాగ‌తిస్తున్నామ‌ని, మ‌న ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు ఇది శుభ సంకేతాన్ని ఇస్తుంద‌ని శ‌క్తికాంత్ దాస్ తెలిపారు. మ‌న దేశంలో కార్పొరేట్ పన్నులు అధికంగాఉన్నాయ‌ని, అదే మ‌న‌కు పెద్ద విఘాతంగే మారింద‌ని, ఇప్పుడు ఆ ప‌న్ను శాతాన్ని త‌గ్గించ‌డం శుభ‌ప‌రిణామం అని ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ తెలిపారు.
ప‌న్ను శాతం త‌గ్గింపు దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు పాజిటివ్ సంకేతం

అభివృద్ధి చెందుతున్న థాయిలాండ్‌, పిలిప్పీన్స్దేశాల్లోనూ ఇలాంటి ప‌న్ను విధాన‌మే ఉంద‌న్నారు.ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన నిర్ణ‌యాన్ని ప‌రిశ్ర‌మ‌లు, స్టాక్ మార్కెట్లు స్వాగ‌తించాయి. అత్యంత సంతోషాన్ని వ్య‌క్తం చేసిన వారు.. ఈ సంస్క‌ర‌ణ వ‌ల్ల ఆర్థికవృద్ధి రేటు ప‌రుగులు పెడుతుంద‌న్నారు. పెట్టుబ‌డులు కూడా పెరుగుతాయ‌ని వ్యాపార‌వేత్త‌లంటున్నారు. కార్పొరేట్ ప‌న్నును 25 శాతానికి త‌గ్గించ‌డం అతి పెద్ద సంస్క‌ర‌ణ అని కోట‌క్ మ‌హేంద్రబ్యాంక్ సీఈవో ఉద‌య్ కోట‌క్‌ పేర్కొన్నారు. కేంద్ర మంత్రి సీతారామ‌న్‌ను బ‌యోకాన్ సీఎండీ కిర‌ణ్ మ‌జుందార్ షా కూడా ప్ర‌శంసించారు. కేంద్ర వాణిజ్య‌, ప‌రిశ్ర‌మ‌ల మంత్రి పీయూష్ గోయ‌ల్ కూడాపన్ను త‌గ్గింపు అంశాన్ని కీర్తించారు. ఇది ఆర్థిక బ‌లోపేతానికి స‌హ‌క‌రిస్తుంద‌న్నారు.

No comments:

Post a Comment