విజయవాడ, సెప్టెంబర్ 27, (way2newstv.in)
కాశం జిల్లాకు చెందిన టీడీపీ నేత రామనాథం బాబు వైఎస్సార్‌సీపీలో చేరిన సంగతి తెలిసిందే. గురువారం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో కండువా కప్పుకున్నారు. జగన్ ఆయన్ను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పర్చూరు నియోజకవర్గంతో పాటూ ప్రకాశం జిల్లాలో వైఎస్సార్‌సీపీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తానన్నారు. రామనాథం బాబు వెంట ముఖ్యమైన అనుచరులు కూడా అధికార పార్టీలో చేరారు.రామనాథం బాబు తిరిగి పాత గూటికి చేరడంతో.. ప్రకాశం జిల్లాలో రాజకీయం ఆసక్తిగా మారింది. జిల్లాలో కీలకమైన నియోజకవర్గం, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఇంఛార్జ్‌గా ఉన్న పర్చూరులో వైఎస్సార్‌సీపీ వ్యూహం మార్చిందనే చర్చ మొదలయ్యింది.
దగ్గుబాటికి చెక్...
ఎన్నికలకు ముందు పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిన నేతను మళ్లీ పార్టీలోకి తీసుకు రావడంపై పార్టీల చర్చ జరుగుతోంది. ఏకంగా జగన్ సమక్షంలోనే రామనాథం బాబు పార్టీ కండువా కప్పుకోవడం ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఈ వ్యూహం వెనుక కారణమేంటనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.దగ్గుబాటిని తప్పించేందుకు జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారా.. రామనాథం బాబు తనంతట తాను పార్టీలోకి వచ్చారా అనేది చర్చనీయాంశంగా మారింది. రామనాథం బాబు పార్టీలో చేరికపై నియోజకవర్గ ఇంఛార్జ్‌గా ఉన్న దగ్గుబాటి వర్గానికి సమాచారం ఇవ్వలేదని తెలుస్తోంది. అలాగే చేరిక కార్యక్రమానికి ఆ వర్గం నుంచి ఎవరూ హాజరు కాకపోవడం ఆసక్తిగా మారింది. కొద్దిరోజులుగా వెంకటేశ్వరరావు.. ఆయన కుమారుడు హితేష్ కూడా పార్టీకి సంబంధించిన కార్యక్రమాలపై అంత ఫోకస్ పెట్టలేదని చర్చ జరుగుతోంది. ఈలోపే రామనాథం బాబు వైఎస్సార్‌సీపీ గూటికి వెళ్లడం ఆసక్తిగా మారింది.రామనాథం బాబు చేరిక కార్యక్రమంలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, నియోజకవర్గంలోని నాలుగు మండలాల పార్టీ కన్వీనర్లు, నియోజకవర్గానికి చెందిన ముఖ్యమైన నేత, ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి కూడా హాజరయ్యారు. ఇలా జిల్లాకు చెందిన మంత్రి, ముఖ్య నేతలు రామనాథం బాబును తీసుకెళ్లి.. అది కూడా జగన్ సమక్షంలో పార్టీలో చేర్పించడం వెనుక వ్యూహం ఏంటని జిల్లాలో చర్చించుకుంటున్నారు.దగ్గుబాటికి చెక్ పెట్టడానికే రామనాథం బాబును పార్టీలో చేర్చుకున్నారనే వాదన వినిపిస్తోందట. వెంకటేశ్వరరావు వైఎస్సార్‌సీపీలో ఉన్నా.. ఆయన సతీమణి పురందేశ్వరి మాత్రం బీజేపీలో కొనసాగుతున్నారు. అంతేకాదు కొద్దిరోజులుగా ఆమె జగన్ సర్కార్‌పై విమర్శలు చేస్తున్నారు. అంతేకాదు కొన్ని సందర్భాల్లో ఎదురు దాడికి దిగారు. ఇటు దగ్గుబాటి కూడా నియోజకవర్గంలో కేడర్, పార్టీ కార్యక్రమాలపైనా ఫోకస్ పెట్టడం లేదట. ఈ పరిణామాలపై జిల్లా నేతలు జగన్‌తో చర్చించారట. వీటన్నంటిని బేరీజు వేసుకొని రామనాథం బాబును మళ్లీ పార్టీలోకి తీసుకొచ్చారని.. ఈ చేరిక వెనుక బాపట్ల ఎంపీ నందిగం సురేష్ చక్రం తిప్పారని జిల్లాలో చర్చ నడుస్తోంది.
No comments:
Post a Comment