Breaking News

27/09/2019

జగన్ కు వివాదస్పద కామెంట్స్. మాజీ మంత్రిపై కేసు

విశాఖపట్టణం, సెప్టెంబర్ 27, (way2newstv.in)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపూ అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై కేసు నమోదయ్యింది. జగన్‌ను ఉద్దేశించి.. ప్రాంత, కుల, మత విద్వేషాలు రెచ్చగొట్టేలా అయ్యన్న వ్యాఖ్యలు చేశారని.. వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ నేత పోలీసులకు ఫిర్యాదు చేశారు. విశాఖ త్రీటౌన్ పోలీసులు ఐపీసీ 153ఏ, 500, 506 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు.రెండు రోజుల క్రితం సీఎం జగన్‌పై అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలు చేశారు. 
జగన్ కు వివాదస్పద కామెంట్స్. మాజీ మంత్రిపై కేసు

జగన్ రక్తంలోనే రౌడీయిజం ఉందని అయ్యన్న ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. పోలీసు వ్యవస్థలో రౌడీయిజం పెరిగిందని.. శాంతిభద్రతలు అదుపు తప్పాయన్నారు. ప్రశాంతంగా ఉంటే విశాఖలో కడప సంస్కృతిని తీసుకొస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. జగన్‌ పాలనపైనా అనుచిత వ్యాఖ్యలు చేశారుమాజీ మంత్రి చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్‌సీపీ నేతలు మండిపడ్డారు. ఎన్నికల్లో టీడీపీకి ప్రజలు బుద్ది చెప్పినా నేతలు ఇంకా పద్దతి మార్చుకోలేదన్నారు. ఐదేళ్ల టీడీపీ పాలన, అరాచకాలు భరించలేక వైఎస్సార్‌సీపీకి 151 సీట్లతో తిరుగులేని విజయాన్ని అందించారని గుర్తు పెట్టుకోవాలన్నారు. మంత్రిగా పనిచేసిన అయ్యన్నపాత్రుడు ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని.. ఇప్పటికైనా తీరు మార్చుకోకపోతే ప్రజలు బుద్ది చెబుతారన్నారు.

No comments:

Post a Comment