Breaking News

16/09/2019

పలితాలు ఇస్తున్న సేవ్ టైగర్ ప్రాజెక్ట్

హైద్రాబాద్, సెప్టెంబర్ 16, (way2newstv.in)
బ్రతికితే పులిలా బ్రతకాలి అంటారు. అయితే ఆ పులి ఏలా బ్రతుకుతుందో తెలుసా..? ఒంటరిగానే. జతకట్టె సమయంలో తప్ప అది మరో ఆడ జంతువును లేదా మగ జంతువును దగ్గరకు రానివ్వదు. దాదాపు ఒంటరి జీవనం గడపడానికి ఇష్ట పడే పెద్ద పులి మన భారత దేశ జాతీయ జంతువు అన్న విషయం అందరికి తెలిసిందే. అంతే కాదు ప్రపంచలోని మరో మూడు దేశాల్లో సైతం పెద్దపులియే జాతీయ జంతువుగా కొనసాగుతోంది. సాధారణంగా పసుపుపచ్చ రంగుతో కూడి నలుపు చారలు ఉండేవి అందరికి తెలిసిందే. కానీ తెల్లపులు కూడా ఉన్నాయి. వాటిని నగరంలోని నెహ్రూ జూలాజికల్‌పార్కులో తిలకించే వీలుఉంది. ఇక జూపార్కులో మొత్తం 19 పెద్దపులు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి.జీవివైవిధ్య పరిరక్షణలో పర్యావరణ సమతూకానికి పెద్దపులి ఉంటే పెద్దపీట అనే చెప్పాలి. 
పలితాలు ఇస్తున్న సేవ్ టైగర్ ప్రాజెక్ట్

ఎందుకంటే ఎక్కడ అడవి పచ్చగా ఉంటుందో అక్కడ పెద్దపులి కాపురం ఉంటున్నట్లుగా పరిశోధనలు రుజువు చేశాయి. 20వ శతాబ్ధం వరకు లక్ష జనాభ కలిగిన పెద్దపులి జాతి ప్రస్తుతం క్షీణిత దశలో ఘణనీయత నమోదవుతుంది.అందుకు మనిషి మనుగడకు కోరుకుంటున్న విధానం వీటి జీవన మనుగడకు ఉప్పెన లాంటి ముప్పునే కలిగిస్తోంది. ఇక ఇతిహాస పురానాల్లో పెద్ద పులి పాత్ర చాలానే ఉంటుంది. ద్వాపర యుగంలో భగవంతుని వాహనం కూడా చరిత్ర పెద్దపులికి ఉంది. వేటాడి ఆహారం సాధించే జంతువుల్లో పెద్దపులి రూటే సఫరేట్. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలలో విస్తరించిన టైగర్‌జాతిలో కూడా ఆరు ఉపజాతులు ఉన్నాయి. వాటిలో భారతదేశపు రాయల్ బెంగాల్ టైగర్‌దే ప్రముఖ స్థానం.ఉమ్మడి తెలుగు రాష్ట్రం నుంచి ఏర్పడిన తెలంగాణలో రెండు జాతీయ టైగర్ రిజర్వులు ఉన్నాయి. వాటిలో ఒకటి నల్లమల అటవీ ప్రాంతంలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వూ కాగా, మరోకటి ప్రకృతి అందాలకు నిలయమైన మన ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల్ టైగర్ రిజర్వూ. ఇక అమ్రాబాద్ పులుల అభయారణ్యం నుంచి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వూకు మన పెద్దపులులు వలస పోతుంటాయి. కానీ అందుకు భిన్నంగా మహారాష్ట్ర అటవీ ప్రాంతం నుంచి కవ్వాల్ పెద్దపులుల అభయారణ్యానికి వలస వచ్చే టైగర్లు వాటి ఉనికితో పాటు సంతాన వృద్ధికి తెలంగాణ అటవీ ప్రాంతాన్ని అనువుగా మలచుకుంటున్నాయి.పెద్దపులి జీవించడానికి చాలా భూవైశాల్యం కోరుకుంటుంది. ఎందుకంటే ఇవి గుంపులుగా మనుగడ సాగించడానికి ఇష్టపడవు. పుట్టిన పిల్ల రెండేళ్ల వయస్సు వచ్చిందంటే తల్లి నుంచి వేరై సొంతంగా మనుగడసాగిస్తుంది. దీంతో దాదాపు పెద్దపులి దాదాపు ఒంటరి జీవిగానే చెప్పాలి. దాంతో అటవీ ప్రాంతాల్లో పరిధులు వీటికి అధికంగానే కావాల్సి ఉంటుంది. ఈ ఒక్క పెద్దపులి జీవన యాత్ర అటవీ వన సంపధలను పదిలంగా చేయుటకు ఎంతగానే ఉపయోగపడుతుంది.దీంతో “పెద్దపులి ఆకారమే పర్యావరణ వ్యవస్థ పెద్దపులి పర్యావరణ వ్యవస్థను సమతూకం చేస్తుంది” అనే నానుడి కొనసాగుతుంది. అయితే దాదాపు అన్ని రకాల వాతావరణ పరిస్థితులను పెద్దపులికి తట్టుకునే శక్తి ఉంటుంది. అతిఉష్ణోగ్రతల నుంచి మైనస్ 40 డిగ్రీల ఉష్ణోగ్రతకు అనుకూలంగా జీవనం విధానం సాగించగలదు. నీటి మడుగుల్లో సరదాగా గడపడం పెద్దదపులి ఇష్టపడుతుంది. అలాగే గట్టిమైదనాల్లో ఠీవిగా సేదతీరే టైగర్ గడ్డిమేసేందుకు వచ్చే జింక తదితర జంతువులను వేటాడి ఆహారంగా తీసుకుంటాయి.ఇక కొన్ని రకాల జంతువులు ఆడ జంతువుతో కాపురం చేయడానికి వాటితో పాటే సహజీవనం కొనసాగిస్తుంటాయి. కానీ పెద్దపులి అలా కాదు ఆహార వేటతో పాటు తన ఉనికి చాటేందుకు ఒంటరిగానే ఉంటుంది. మరీ వీటి సంతాన వృద్ధి ఎలా ..? అనుకుంటున్నారా..? బ్రీడింగ్ సీజన్‌లో మాత్రం ప్రత్యేక సంకేతాల ద్వారా ఆడ, మగ ఒక్కటవుతాయి. ఈ సమయంలో రెండు మగ జంతువులు ఎదురైన వాటి మద్య భీకరపోరు తప్పదు. అనంతరం పోరులో గెలిచిన మగ జంతువు ఆడ పులితో జతకడుతుంది. మగ జంతువుతో జతకట్టిన ఆడ జంతువు గర్భందాల్చి 98 నుంచి 110 రోజుల గర్భదారణ అనంతరం రెండు నుంచి నాలుగు కూనలకు జన్మనిస్తుంది. అయితే ఈ సమయంలో పుట్టిన పిల్లల పై ప్రత్యేక శ్రద్ధ చూపే ఆడపులి వాటికి ఆపద ఉందని గ్రహిస్తే పుట్టిన పిల్లలు కళ్లు తెరవక ముందే తినేస్తుంది.

No comments:

Post a Comment