Breaking News

26/09/2019

పవన్ ను బాధిస్తున్న వెన్నుముక నొప్పి

హైద్రాబాద్, సెప్టెంబర్ 26, (way2newstv.in)
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెన్నెముక నొప్పితో బాధపడుతున్నారా.. డాక్టర్లు సర్జరీ చేయాలని సూచించారా.. పవన్ మాత్రం సర్జరీ వద్దంటున్నారా.. అవును నిజమేనంటోంది జనసేన. తాజాగా విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని తెలియజేసింది. కొద్దిరోజులుగా జనసేనాని వెన్నెముక నొప్పితో బాధపడుతున్నారట. అందుకే పార్టీ కార్యక్రమాల్లో కాస్త వేగం తగ్గించినట్లు పరోక్షంగా చెబుతున్నారు. వెన్నెముక నొప్పికి సంబంధించి ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు పవన్ పార్టీ ద్వారా విడుదల చేసిన ప్రకటనలో తెలియజేశారు.
పవన్ ను బాధిస్తున్న వెన్నుముక  నొప్పి

పవన్ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో.. ‘మీడియా మిత్రులకు నమస్కారం.. విజయవాడలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం ఏర్పాటు చేసి, ఆ సమావేశానికి నన్ను ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు. మీడియా స్వేచ్చ కోసం మీరు చేస్తున్న పోరాటానికిజనసేన తరఫున, వ్యక్తిగతంగా నా తరఫున సంపూర్ణ మద్దతును తెలియచేస్తున్నాను. అయితే ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల నేను ఈ సమావేశానికి హాజరు కాలేకపోతున్నాను’అన్నారు.గబ్బర్‌ సింగ్‌ సినిమా షూటింగ్‌ సమయంలో వెన్ను పూసలకు తీవ్ర గాయాలు కావడంతో తరచూ నన్ను వెన్ను నొప్పి బాధిస్తోంది. ఇటీవల కాలంలో ఎన్నికల ప్రచార సమయంలో అశ్రద్ధ చేయడంవల్ల గాయాల నొప్పి తీవ్రత పెరిగింది. డాక్టర్లు సర్జరీకి వెళ్ళమని సలహా ఇచ్చినప్పటికీ సంప్రదాయ వైద్యం పై నమ్మకంతో ఆ దిశగానే ముందుకు వెళుతున్నాను. గత కొన్ని రోజులుగా మళ్ళీ బ్యాక్‌ పెయిన్‌ తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను’అంటూ ప్రకటనలో తెలిపారు.‘ఈ కారణంగానే గత మూడు రోజులుగా ఎటువంటి కార్యక్రమాలలో పాల్గొనడం లేదు. అయితే జనసేన తరఫు నుంచి పార్టీ ప్రతినిధులు మీరు నిర్వహించనున్న రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పాల్గొంటారు. ఈ సమావేశం విజయవంతం కావాలి’అని ఆకాంక్షించారు. పవన్ గాయం తిరగబెట్టిందని.. ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు తెలియజేయడంతో జనసైనికులు, అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

No comments:

Post a Comment