Breaking News

20/08/2019

కేటీఆర్ సావాల్ పై నడ్డా స్పందించాలి - విజయశాంతి

హైదరాబాద్,  ఆగష్టు 20 (way2newstv.in - Swamy Naidu):
కేసీఆర్ ప్రభుత్వం ప్రాజెక్టుల పేరుతో వేల కోట్ల రూపాయల నిధులను స్వాహా చేసిందని బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నడ్డా గారు చెప్పిన మాటలన్నీ పచ్చి అబద్ధాలని..దమ్ముంటే అవినీతిపై ఆధారాలు చూపించాలని టీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్  సవాల్ విసిరారు.  కేటీఆర్  ఈ సవాల్ విసిరే ముందు తన తండ్రి కేసీఆర్  అనుమతి తీసుకున్నారా? అనే అనుమానం కలుగుతోందని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్ పర్సన్   విజయశాంతి అన్నారు. ఈ మేరకు ఒక ప్రకటన ఆమె మంగళవారం విడుదల చేసారు. ఇంటర్ విద్యార్ధుల ఆత్మహత్యలకు గ్లోబరీనా సంస్ధ నిర్లక్ష్యమే కారణమని, ఈ గ్లోబరీనా సంస్ధకు టీఆరెస్ పెద్దలతో సంబంధాలు ఉన్నాయని నాతో పాటూ ప్రతిపక్షనేతలు చాలా మంది ఆరోపించినప్పుడు కూడా కేటీఆర్  ఇదే రకంగా సవాల్ విసిరారు.దమ్ముంటే తమపై ఆరోపించిన వారు ఆధారాలు చూపాలన్నారు. 

 కేటీఆర్ సావాల్ పై నడ్డా స్పందించాలి - విజయశాంతి
ఈ వ్యవహారంపై ఆధారాలతో సహా రాష్ట్రపతికి ఫిర్యాదుచేయడంతో, ఇంటర్ విద్యార్ధుల ఆత్మహత్యలపై రాంనాథ్ కోవింద్ వెంటనే స్పందించారు.  ఈ మొత్తం ఉదంతంపై విచారణ జరిపి, నివేదిక ఇవ్వాలని రాష్ట్రపతి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు.   ఈ పరిణామంతో ఖంగుతిన్న కేసీఆర్  ఇదంతా ప్రతిపక్షాల కుట్ర అని, అనవసరంగా తమను బద్నాం చేస్తున్నారని  ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారని ఆమె అన్నారు. ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయని విమర్శించే ముందు తన తనయుడు కేటీఆర్ ఎందుకు సవాల్ విసిరారో కేసీఆర్  అడిగితే బాగుంటుంది.  ఇంటర్ విద్యార్ధుల ఆత్మహత్యల ఉదంతం మాదిరిగానే..కేటీఆర్ విసిరిన సవాల్ పై తమ నిబద్ధతను నిరూపించుకునేందుకు జేపీ.నడ్డా  తమ వద్ద ఉన్న ఆధారాలను కేంద్రానికి ఇచ్చి, కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపి, వాస్తవాలను వెలుగులోకి తేవాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని ఆమె అన్నారు. 

No comments:

Post a Comment