Breaking News

20/08/2019

టిఆర్ఎస్ చేతగాని పార్టీ

హైదరాబాద్, ఆగష్టు 20 (way2newstv.in - Swamy Naidu):
ఇరవై ఏడు మంది ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యలపై రాష్ట్ర ప్రభుత్వం కనీసం విచారణ చేయడం లేదని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్ళాం. రాష్ట్రపతి ఆదేశాలను కూడా రాష్ట్ర  ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కె జోషి పద్దతిని తీవ్రంగా నిరసిస్తున్నామని బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి కృష్ణ సాగర్ రావు విమర్శించారు. మంగళవారం అయన మీడియాతో మాట్లాడారు.  ఎస్కె జోషి రాష్ట్రపతికి తొందరగా నివేదిక పంపకపోతే ఏం చేయాలో అది చేస్తాం. కేటీఆర్ ప్రాస కోసం గోస పడుతున్నాడు. కేటీఆర్ ప్రతి మీటింగ్ లో ప్రాసల కోసం పడే కష్టం చూస్తే జాలేస్తుంది.  కాంగ్రెస్ కు రాహుల్ గాంధీ ఎలాగో, టిఆర్ఎస్ కు కేటీఆర్ అలాగే. కేటీఆర్ లో అభద్రతభావం మొదలైందని అయన అన్నారు. 
 టిఆర్ఎస్ చేతగాని పార్టీ
తాను మాట్లాడేది అర్ధం కాక కొందరు చప్పట్లు కొడితే కేటీఆర్ మాత్రం సంబరపడుతున్నాడు. టిఆర్ఎస్ చేతగాని పార్టీ అని విమర్శించారు. బీజేపీ నాయకులం ఎంత ప్రయత్నించినా కేటీఆర్ లాగా వ్యక్తిగత దూషణలు చేయడం రాదు. ఆరు సంవత్సరాల్లో ఏం చేశారో చెప్పడానికి బహిరంగ చర్చ కు సిద్ధమా?  కేటీఆర్...దమ్ముంటే బహిరంగ సవాలును స్వీకరిస్తావా అని అడిగారు. విషయపరిజ్ఞానం లేకుండా కేటీఆర్ నోటికి వచ్చింది మాట్లాడుతున్నాడు. కర్ణాటకలో ఏం జరిగిందో కేటీఆర్ కు అర్ధమే కాలేదు.  కేటీఆర్ వేరే పనుల్లోనే ఎక్కువగా బిజీ ఉంటారు. తెలంగాణలో వ్యవస్థల విధ్వంసం జరుగుతోంది. కేసీఆర్ ఈ రాష్ట్రానికి అదృశ్య ముఖ్యమంత్రి. కేసీఆర్ తన ప్రభుత్వ అసమర్థతను మభ్యపెట్టడానికి తన కొడుకుతో ఎదురుదాడి చేయిస్తే సరిపోదని అన్నారు. 

No comments:

Post a Comment