Breaking News

10/08/2019

తెలంగాణలో బలమైన శక్తిగా బీజేపీ

మహబూబ్ నగర్ ఆగష్టు 10(way2newstv.in - Swamy Naidu)
ఇతర పార్టీల కింది స్థాయి నాయకులు బీజేపీ వైపు చూస్తున్నారు. కేసీఆర్ కుటుంబం తప్ప రాష్ట్రంలో ఇంకెవరు బాగుపడలేదు. మెరుగైన అభివృద్ధి జరుగుతుందని తెలంగాణ తెచ్చుకుంటే అది కాస్తా అందని ద్రాక్ష అయింది. నాయకులనే కాదు. పార్టీని కూడా కాపాడుకునే పరిస్థితుల్లో కాంగ్రెస్ అధిష్టానం లేదని బీజేపీ నేత, మాజీ మంత్రి డికే ఆరుణ అన్నారు.
 తెలంగాణలో బలమైన శక్తిగా బీజేపీ
తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. కేంద్రంలో,రాష్ట్రంలో బీజేపీ వస్తేనే తెలంగాణ బీజేపీ అభివృద్ధి చెందుతుంది. గ్రామ పంచాయతీ లకు ఒక్కరూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు. సర్పంచ్ కు ,ఉప సర్పంచ్ కు మధ్య కొట్లాట పెట్టింది ప్రభుత్వమని అన్నారు. గ్రామ సర్పంచ్ లకు అండగా ఉంటాం. కేంద్ర ప్రభుత్వం తో మాట్లాడి సర్పంచ్ ల హక్కులను కపడుతాం. ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన సీఎం ను కూడా పదవీ నుంచి ప్రజలు తొలగిస్తారు. 2023లో రాష్ట్రంలో బలమైన శక్తిగా బీజేపీ అవతరించబోతుందని ఆమె అన్నారు.

No comments:

Post a Comment