Breaking News

10/08/2019

మతోన్మాదం పెచ్చరిల్లితే భవిష్యత్‌ తరాల పరిస్థితి ఆందోళనకరం : కేటీఆర్

హైద్రాబాద్, ఆగస్టు 10  (way2newstv.in -Swamy Naidu)
దేశంలో ప్రస్తుతం ప్రత్యేక పరిస్థితులు నెలకొన్నాయంటూ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. తమతో ఉంటే దేశభక్తులు, లేకపోతే దేశద్రోహులు అంటూ ముద్రవేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో తెలంగాణ వికాస్ సమితి మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరైన కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజ్ఞాసింగ్ ఠాకూర్, గాడ్సేలను దేశభక్తులు అంటే ఖండించానని తెలిపారు. కొందరి వ్యాఖ్యల ఫలితంగా మహాత్మాగాంధీని గౌరవించని జాతి మనది అనే బాధ కలిగిందని అన్నారు. దేశంలో మతం, జాతీయవాదం పెనవేసుకుపోయాయని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.. తెలంగాణ వికాస సమితి భిన్నాభిప్రాయాలను పంచుకునే వేదిక అని తెలిపారు. భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేసేందుకు హైదరాబాద్‌లో స్వేచ్ఛ ఉందన్నారు. 
మతోన్మాదం పెచ్చరిల్లితే భవిష్యత్‌ తరాల పరిస్థితి ఆందోళనకరం : కేటీఆర్
పాలనలో ఏమైనా తప్పులున్నా ఎత్తి చూపే స్వేచ్ఛ వికాస సమితికి ఉంది. భాషకు మతం ఉండదని ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ ఎప్పుడూ చెబుతుండేవారు. ముస్లింల కంటే అనర్గళంగా ఉర్దూ మాట్లాడే ఇతరులు చాలా మంది ఉన్నారు. లౌకికవాద దేశమంటే మతాన్ని రద్దు చేయడం కాదు. ఒక మతాన్ని వ్యతిరేకించడం, లేదా అతిగా ప్రాధాన్యం ఇవ్వడం సరికాదు. సెక్యులరిజం అంటే అన్ని మతాలను పరస్పరం గౌరవించుకోవడం. మతం, రాజకీయం విడదీయలేనంత ప్రమాదకరంగా పెనవేసుకుపోతోంది. అందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చిన ఘనత తెలంగాణ ఉద్యమానిది. మతోన్మాదం పెచ్చరిల్లితే భవిష్యత్‌ తరాల పరిస్థితి ఆందోళనకరం. గాడ్సే గొప్ప దేశభక్తుడని సాధ్వీప్రజ్ఞాసింగ్‌ చేసిన వ్యాఖ్యను తాను ఖండిస్తే సోషల్‌ మీడియాలో దారుణమైన వ్యతిరేకత వ్యక్తమైంది. ప్రస్తుతం దేశంలో ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి. తర్కించి, విభేదించే పరిస్థితి లేకపోతే ప్రజాస్వామ్యానికి అర్థం లేదు. తనతో ఉంటే దేశభక్తుడిని.. లేకపోతే దేశద్రోహిని అనే పరిస్థితులు ఉన్నాయి. ఉదాత్తమైన ఆశయంతో తెలంగాణ వికాస సమితి ఏర్పడింది. తెలంగాణలో మతభేదం లేకుండా జీవనం కొనసాగుతోంది అని కేటీఆర్‌ పేర్కొన్నారు. 2014, జులై 4వ తేదీన దొడ్డి కొమురయ్య వర్ధంతి రోజున వికాస సమితి ఆవిర్భవించింది. 

No comments:

Post a Comment