Breaking News

10/08/2019

నిండుకుండలా శ్రీశైలం జలాశయం

శ్రీశైలం ఆగస్టు 10, (way2newstv.com)
ఎగువ పరీవాహక ప్రాంతమైన జూరాల ప్రాజెక్టు నుంచి శ్రీశైలం జలాశయానికి వరద నీరు పోటెత్తుతుంది. దీంతో అధికారులు 10 గేట్లను పైకెత్తి 3,16,608 క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న నాగార్జున సాగర్ కు వదులుతున్నారు. జలాశయానికి 5,22,902 క్యూసెక్కుల ఇన్ ఫ్లో  వస్తోంది. శ్రీశైలం జలాశయ పూర్తిస్థాయి సామర్థ్యం 215.81 టీఎంసీలు ఉండగా.. ప్రస్తుతం 202.50 టీఎంసీలకు పైగా ఉంది. 
నిండుకుండలా శ్రీశైలం జలాశయం

ఎడమగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 42,378 క్యూసెక్కులు,కుడిగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 30,187 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. కల్వకుర్తికి  800క్యూసెక్కులు, హంద్రీనీవాకు 2025 క్యూసెక్కులు, పొతిరెడ్డిపాడుకు 28000 క్యూసెక్కులు, ముచ్చుమర్రికి 735 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు. మరోవైపు నాగార్జున సాగర్ జలాశయానికి కూడా వరద కొనసాగుతోంది. ఇన్ ఫ్లో 2,05,181 క్యూసెక్కులు ఉండగా.. ఔట్ ఫ్లో 6,051 క్యూసెక్కులు ఉంది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకుగానూ.. ప్రస్తుతం 520.90 అడుగుల నీటిమట్టం నమోదైంది. జలాశయం పూర్తి సామర్థ్యం 312.05 టీఎంసీలుకాగా.. ప్రస్తుతం 150.92 టీఎంసీల నీటి నిల్వ ఉంది.

No comments:

Post a Comment