Breaking News

10/08/2019

మహిళలు, బాలికల భద్రత పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది

హోమ్ మంత్రి సుచరిత
కర్నూలు  ఆగస్టు 10 (way2newstv.in)
మహిళలు, బాలికల భద్రత పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. మహిళా భద్రత కోసం ప్రతి పోలీస్ స్టేషన్ మహిళా మిత్రలను  పెట్టామని హోం మంత్రి సుచరిత అన్నారు. శనివారం సాయంత్రం కర్నూలు నగరం వెంకటరమణ కాలనీలో రూ.1.50 కోట్లతో నిర్మించిన పోలీస్ సిఐడి ప్రాంతీయ కార్యాలయం నూతన భవనాన్ని  హోమ్ మంత్రి సుచరిత, రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రారంభించారు. 
మహిళలు, బాలికల భద్రత పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది

ఈ కార్యక్రమంలో  కర్నూలు ఎంపీ డా.సంజీవ కుమార్, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్, కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్ , పత్తికొండ ఎమ్మెల్యే  కె.శ్రీదేవి, బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి, మంత్రాలయం ఎమ్మెల్యే బాల నాగిరెడ్డి తదితరులు. రాజ్యసభ సభ సభ్యులు టిజి వెంకటేష్, కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. సిఐడి అదనపు డిజిపి అమిత్ గార్గ్, జిల్లా కలెక్టర్ గణేశ వీరపాండ్యన్, డిఐజి వెంకట్రామిరెడ్డి, ఎస్పీ డా. కె.ఫక్కీరప్ప, జెసి రవి పట్టన్ శెట్టి , అదనపు ఎస్పీ దీపికా పాటిల్, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ విధేకరే, జెసి2 ఖాజా మోహిద్దీన్, పలువురు  సిఐడి, పోలీసు అధికారులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు 

No comments:

Post a Comment