Breaking News

14/08/2019

. యాక్సిస్ బ్యాంకు దోపిడిదారులు ఆరెస్టు

హైదరాబాద్ ఆగస్టు 14 (way2newstv.in - Swamy Naidu)
గత మే 7వ తేదీన వనస్థలీపురం పనామా గోడౌన్స్ వద్ద యాక్సిస్ బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేయడానికి వచ్చిన వాహనం నుంచి  నగదును అపహరించిన  నలుగురు వ్యక్తులను రాచకొండ పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు.  ఈ ఘటనలో వారు  58 లక్షల రూపాయల అపహరించారు. రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ మాట్లాడుతూ ఫిర్యాదు అందిన వెంటనే లా అండ్ ఆర్డర్ పోలీసులు ఎస్వోటీ పోలీసులు సిసిఎస్ పోలీసులు అందరం కలిసి పరిశీలించాం. దాదాపు మూడు నెలలుగా నిందితుల కోసం తీవ్రంగా గాలించామని అన్నారు. తమిళనాడు ప్రాంతానికి చెందిన రాంజీ ప్రాంతానికి చెందిన ముఠా గా గుర్తించినప్పటికీ నిందితులు ఒక్కొక్కరూ ఒక్కో ప్రాంతానికి పారిపోవడంతో అరెస్ట్ కి కాస్త ఇబ్బంది ఏర్పడింది.  
యాక్సిస్ బ్యాంకు దోపిడిదారులు ఆరెస్టు
ఈ ముఠా ప్రధాన నాయకుడు దీపక్.. అతని అనుచరులు సత్య రాజ్ ,యోగ్రాజ్ ,సురేష్ ఈ నలుగురు ఒక ముఠాగా ఏర్పడి తమిళనాడు, బెంగళూరు, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, హైదరాబాద్ ప్రాంతాల్లో అనేక నేరాలకు పాల్పడ్డారు. చివరకు వీరు ప్రయాణిస్తున్న కార్ పైన నిఘా పెట్టి నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని అయన అన్నారు. పదిహేనేళ్ళ కిందట వీరంతా తమిళనాడులో స్పిన్నింగ్ మిల్స్ లో పనిచేశారు. దోపిడీలు దొంగతనాలు దృష్టి మళ్లించి చోరీలు చేయడం మొదలుపెట్టారు. ఈరోజు తెల్లవారుజామున నిందితులను అరెస్టు చేశాం. నిందితుల నుండి ఇంకా వివరాలు రాబట్టాల్సి ఉందని అయన అన్నారు.

No comments:

Post a Comment