Breaking News

14/08/2019

టిడ్కోపై ముఖ్యమంత్రి వైయస్.జగన్ సమీక్ష

అమరావతి ఆగస్టు 14 (way2newstv.in - Swamy Naidu)
టిడ్కోపై ముఖ్యమంత్రి  వైయస్.జగన్  బుధవారం సమీక్ష నిర్వహించారు. పట్టణ ప్రాంతంలో ఇళ్ల నిర్మాణం తీరునుఅయన సమీక్షించారు. సీఎం మాట్లాడుతూ ఏ పనిచేపట్టినా అందులో స్కాం లేకుండా చూసుకోండి. వాస్తవ రేట్లు ఏంటి? మనం నిర్ణయించిన రేట్లు ఏంటి? అన్నది ఒకటికి రెండు సార్లు చెక్ చేయండి. రేట్లను ఖరారు చేయడానికి నిపుణుల సలహాలు తీసుకోండి. ప్రతిష్టాత్మక సంస్థల్లో నిపుణుల అభిప్రాయాలు స్వీకరించండని సూచించారు. ఇప్పుడున్న ఎస్ఎస్ఆర్ను బేస్చేసుకోవాల్సినఅవసరంలేదు, వాస్తవ రేట్లను పరిగణలోకి తీసుకొని రివర్స్ టెండర్లు ఖరారుచేయాలి. ఇసుక ఫ్రీ, సబ్సిడీపై సిమెంటు, స్థలం ఫ్రీ అయినప్పుడు కచ్చితంగా రేట్లు తగ్గాలి.  
 టిడ్కోపై ముఖ్యమంత్రి  వైయస్.జగన్ సమీక్ష
ఈనెలాఖరు కల్లా కొత్త రేట్ల ఖరారు చేస్తామన్న అధికారులు, వచ్చే నెలలో రివర్స్ టెండరింగ్ నిర్వహిస్తామని అయన వివరించారు. పట్టణ ప్రాంతంలో గృహనిర్మాణం  పరిస్థితి గురించి అయన ఆరా తీసారు.  పునాదిలో లోపల స్థాయిలో 65వేల ఇళ్లు, బేస్మెంట్ లెవల్లో 37వేల ఇళ్లు, మొత్తంగా 1.02వేల ఇళ్లకు రివర్స్ టెండరింగ్, వేర్వేరు దశల్లో 1.75 లక్షల ఇళ్లు వున్నాయని అధికారులు వివరించారు. అర్హులైన మిగిలిన 4 లక్షల మందికి ఫ్లాట్లు కట్టించడానికి భూమిగుర్తించాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యన్నారాయణ, ఆర్ధిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబుపాటు సంబంధిత శాఖలు అధికారులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment