Breaking News

14/08/2019

సెప్టెంబర్ 1 నుంచి రాత పరీక్షలు 6 వేల కేంద్రాలు ఏర్పాటు గూగుల్ మ్యాప్ వెసులుబాటు ఈ నెల 22 నుంచి హాల్ టికెట్లు

అమరావతి ఆగస్టు 14 (way2newstv.in - Swamy Naidu)
గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది నియామకాలను పారదర్శకంగా, మెరిట్ ఆధారంగానే భర్తీ చేస్తామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజా శంకర్ తెలిపారు. పరీక్ష షెడ్యూల్ను మున్సిపల్శాఖ కమిషనర్ విజయ్కుమార్తో కలిసి మంగళవారం విడుదల చేశారు. మొత్తం 1,41,672 పోస్టుల కోసం 21,69,719 మంది దరఖాస్తులు చేసుకున్నట్లు తెలిపారు. మొదటి కేటగిరిలో ఉన్న 36,449 పోస్టులకు 12,54,034 మంది దరఖాస్తులు చేసుకున్నట్టు చెప్పారు. ఈ పోస్టులకు సెప్టెంబరు 1 నుంచి 8వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నట్టు వివరించారు. 5వ తేదీన ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా ఎలాంటి పరీక్షలు నిర్వహించడం లేదని తెలిపారు. 21 లక్షల మంది పరీక్ష రాసేందుకు కేంద్రాలను గుర్తిస్తున్నట్టు గిరిజా శంకర్ చెప్పారు.

 సెప్టెంబర్ 1 నుంచి రాత పరీక్షలు 
6 వేల కేంద్రాలు ఏర్పాటు  గూగుల్ మ్యాప్ వెసులుబాటు ఈ నెల 22 నుంచి హాల్ టికెట్లు
వీరికి సుమారుగా 6 వేల సెంటర్లు అవసరమవుతాయన్నారు. పరీక్షా కేంద్రాల్లో 24 మంది అభ్యర్థులు మాత్రమే ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. అభ్యర్థులందరికీ గూగుల్ మ్యాప్ లింక్ను అందుబాటులోకి తెస్తున్నామన్నారు.4 తప్పులకు ఒక మార్కు కట్పరీక్ష విధానం, కరెక్షన్ వంటివి పగడ్బందీగా చేస్తున్నామని గిరిజా శంకర్ వివరించారు. ఈ నెల 22 నుంచే హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని అన్నారు. అన్ని పోస్టులకు 150 మార్కులకు పరీక్షలు ఉంటాయని, కేటగిరీ 1లో ఉన్న పోస్టులకు పార్టు(ఏ) 75 మార్కులు, పార్టు(బీ) 75 మార్కులకు ఉంటుందన్నారు. మిగిలిన అన్ని పోస్టులకు పార్టు(ఏ) 50, పార్టు(బీ) 100 మార్కులకు జరుగుతుందని చెప్పారు. ప్రతి నాలుగు తప్పు సమాధానాలకు ఒక మార్కు కట్ చేస్తామన్నారు.

No comments:

Post a Comment