Breaking News

14/08/2019

ఎమ్మెల్సీ ఉప ఎన్నిక తేదీ ఖరారు

అమరావతి ఆగస్టు 14 (way2newstv.in - Swamy Naidu)
శాసన మండలిలో ఖాళీ అయిన ముగ్గురు శాసన మండలి సభ్యుల కోసం  ఉప ఎన్నికలు నిర్వహించడం జరుగుతోంది.  ఎమ్మెల్సీ అభ్యర్థులుగా  మహ్మద్ ఇక్బాల్, చల్లా రామకృష్ణారెడ్డి, మోపిదేవి వెంకటరమణ లు బుధవారం ఉదయం  వెలగపూడి లోని అసెంబ్లీ కార్యదర్శి, శాసనమండలి ఎన్నికల రిటర్నింగ్ అధికారి  పి. బాలకృష్ణ మాచార్యులు వారికి వారి కార్యాలయం లో నామినేషన్లు దాఖలు చేసారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆగస్ట్ 7వ తేదీన ఖాళీ అయిన  మూడు శాసన మండలి సభ్యుల పోస్టులు  భర్తీ కి నోటిఫికేషన్ విడుదల చేసారు. 
 ఎమ్మెల్సీ ఉప ఎన్నిక తేదీ ఖరారు
ఆగస్ట్ 14 న నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఆగస్ట్ 16 నామినేషన్ పత్రాల పరిశీలన ఉంటుందని తెలిపారు. ఆగస్ట్ 19 నామినేషన్ పత్రాల ఉపసంహరణ కు చివరిరోజుగా నిర్ణయించారు. ఆగస్ట్ 26 న అవసరమైన సందర్భంలో ఎన్నిక పక్రియలో భాగంగా ఓటింగ్ ను నిర్వహిమని,  అనంతరం ఆగస్ట్ 28 తో శాసన మండలి  బై ఎలెక్షన్ ప్రక్రియ ముగుస్తుందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి తెలిపారు

No comments:

Post a Comment