బెంగళూర్, ఆగస్టు 26 (way2newstv.in - Swamy Naidu)
కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప మంత్రి పదవుల కేటాయింపులో ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని అనుసరిస్తున్నారు. గతవారం క్యాబినెట్‌ను విస్తరించిన కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప.. ముగ్గురు డిప్యూటీ సీఎంలను నియమిస్తారనే సంకేతాలు వెలువరించారు. క్యాబినెట్‌లో మంత్రులకు సోమవారం శాఖలను కేటాయించనున్న ముఖ్యమంత్రి.. డిప్యూటీ సీఎంల విషయంలో ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఆ ముగ్గురు పేర్లు దాదాపు ఖరారు కావడంతో మంత్రివర్గంలో చోటుదక్కని బీజేపీ నేతలు మరింత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అనుభవజ్ఞులకే ఈ పదవులను కేటాయించాలని సీనియర్ నేతలు కోరుతున్నారు. లింగాయత్ నేత లక్ష్మణ్ సవాదీ, ఒక్కలిగ వర్గానికి చెందిన యువనేత అశ్వత్థనారాయణ, దళిత నాయకుడు గోవింద్ ఎం కర్జోల్ ఈ రేసులో ఉన్నారని ప్రచారం సాగుతోంది.
జగన్ ను ఫాలోఅవుతున్న యడ్డీ
మంత్రులకు శాఖలను కేటాయించనున్నామని, డిప్యూటీ సీఎంలను కూడా నియమిస్తామని వీరు ఎంతమంది ఉంటారనే విషయం సోమవారం తెలుస్తుందని యడ్డీ అన్నారు. సవాదీ చేరిక తీవ్ర అసమ్మతి రేగడంతో పార్టీ అధిష్ఠానం నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలని ఆయన వ్యాఖ్యానించారు. ఒకరు నుంచి ముగ్గురు ఉప ముఖ్యమంత్రులు ఉంటారని సీఎం యడ్డీ ధ్రువీకరించడంతో అనుభవం లేనివారికి మంత్రివర్గంలో చోటుకల్పించారని సీనియర్లు తీవ్ర ఆగ్రహం కలిగిస్తోంది. క్యాబినెట్‌లో తమకు అవకాశం కల్పించకపోవడంతో గుర్రుగా ఉన్న సీనియర్లు.. బాహటంగానే తమ అసమ్మతి వెళ్లగక్కుతున్నారు. వాస్తవానికి ఆదివారమే మంత్రులకు శాఖలను కేటాయించాల్సి ఉండగా, జైట్లీ మృతితో వాయిదా పడింది. కాగా, కర్జోలీకి డిప్యూటీ పదవి ఇవ్వడంపై సీనియర్ నేతల నుంచి ఎలాంటి అభ్యంతరం వ్యక్తం కావడంలేదు.అశ్వత్థనారాయణ మంత్రి కాదని, లక్ష్మణ్ సవాదీ కనీసం ఎమ్మెల్యేగా గెలవలేదని... ఇలాంటి వారికి ఉన్నత పదవి ఎలా కట్టబెడతారని బీజేపీకి చెందిన ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు. పార్టీ కోసం శ్రమించిన సీనియర్లను అగౌరవపరచడమేనని అన్నారు. మాజీ సీఎం జగదీష్ షెట్టర్ మంత్రివర్గంలో డిప్యూటీ సీఎంలుగా చేసిన కే ఈశ్వరప్ప, ఆర్ అశోకలను విస్మరించారని వారి మద్దతుదారులు దుయ్యబడుతున్నారు. కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడంతో అధికారం చేపట్టిన బీజేపీ.. క్యాబినెట్ కూర్పులో ఆచితూచి అడుగులు వేసింది. మూడు కీలక సామాజిక వర్గాలకు పెద్ద పీట వేసింది. ఇందులో భాగంగానే యువనేతలు అశ్వత్థనారాయణ, సవాదీలను ఎంపికచేసింది. అయితే, బెలగావీ ప్రాంతంలో పార్టీకి కీలకంగా ఉన్న ఉమేశ్ కట్టీ తనకు మంత్రివర్గంలో చోటుదక్కుతుందని భావించారు. అయితే తనను కాదని సవాదీకి పదవి దక్కడంతో తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఒకవేళ సవాదీకి డిప్యూటీ పోస్టు ఇస్తే తాను మంత్రిగా ఉండటానికి ఇష్టపడనని అన్నారు. మంత్రి పదవులపై కొంతకాలం వేచిచూస్తామని, ఎమ్మెల్యేగా గెలవని వ్యక్తిని డిప్యూటీ సీఎం చేస్తారని ప్రచారం సాగుతోందన్నారు. ఒకవేళ అదే జరిగితే తనకు మంత్రిపదవి ఇచ్చినా తీసుకోనని ఉమేశ్ అన్నారు.
No comments:
Post a Comment