వరంగల్, ఆగస్టు 27, (way2newstv.in)
స్టడీ అయిపోగానే జాబ్ వెతుక్కోవడం పాత పద్ధతి. డిగ్రీతోనే జాబ్ వేటలో పడడం లేటెస్ట్ ట్రెండ్. చదువుతోపాటే జాబ్స్ చేయడం కొన్నాళ్లు నడిచినా అన్ని కాలేజీల్లో బయోమెట్రిక్ రావడంతో ఆ విధానానికి బ్రేక్ పడింది. దాదాపు అన్ని జాబ్స్‌కు డిగ్రీనే క్వాలిఫికేషన్ కావడంతో హయ్యర్ ఎడ్యుకేషన్ కంటే జాబ్స్‌కు వెళ్లడమే బెటరని యూత్ భావిస్తోంది. దీంతో డిగ్రీ తర్వాత పీజీ కోర్సుల్లో చేరుతున్న వారి సంఖ్య తగ్గుతోంది. ఈ మధ్య ఇంటర్ నుంచే స్టూడెంట్స్ జాబ్ ఆలోచన చేస్తుండడమూ ఎక్కువైంది.రాష్ట్రంలో ఏటా సప్లిమెంటరీతో కలిపి 4 లక్షల మంది వరకు ఇంటర్‌లో పాసవుతున్నారు. కానీ వారిలో అండర్ గ్రాడ్యుయేట్(డిగ్రీ, బీటెక్) కోర్సుల్లో మాత్రం 2.80 లక్షల మందే చేరుతున్నారు. వీరిలో రెండు లక్షల మంది వరకూ పాసవుతున్నా, లక్ష మంది కూడా పీజీ కోర్సుల్లో చేరడం లేదు.
డిగ్రీ చదువులతో ఫుల్ స్టాప్
మిగిలిన వారిలో కొందరు చదువుకు దూరమవుతుండగా, ఇంకొందరు ఏదో ఓ జాబ్ చూసుకుంటున్నారు. 2018–-19 అధికారిక లెక్కల ప్రకారం డిగ్రీ, పీజీ కోర్సులకు సంబంధించి 6,52,178 సీట్లుంటే, చేరింది 3,97,225 మందే. స్టూడెంట్స్ అడ్మిషన్స్ తగ్గుతుండటంతో కాలేజీలూ మూతపడుతున్నాయి.ఇంటర్ అవగానే డిగ్రీలో చేరేవారి సంఖ్య కూడా తగ్గుతోంది. గతేడాది లెక్కల ప్రకారం డిగ్రీ, బీటెక్, బీఫార్మసీ తదితర కోర్సుల్లో 2.80 లక్షల మంది చేరారు. ఇందులో రెండు లక్షల మంది వరకూ డిగ్రీలో చేరగా, 69 వేల మంది ఇంజినీరింగ్, 9 వేల మంది బీఫార్మసీలో జాయినయ్యారు. దాదాపు లక్ష మంది వరకూ ఇంటర్‌తోనే చదువు ఆపేశారు. వీరిలో ఎక్కువ మంది చిన్న చిన్న జాబ్స్‌లో జాయిన్ అవుతుండగా, కొందరు ఇతర కారణాలతో చదువుకు దూరమవుతున్నారు. ఇంకొందరు ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు, సౌదీ, దుబాయ్ వంటి దేశాలకు వెళ్తున్నారు.డిగ్రీలో పాసైన వారిలో మూడో వంతు మందే పీజీలో చేరుతున్నారు. గతేడాది పీజీ, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ, బీఈడీ తదితర కోర్సుల్లో 60 వేల మందే చేరారు. పీజీలో 26 వేల మంది వరకూ చేరగా ఎంబీఏ, ఎంసీఏలో 17 వేల వరకూ చేరారు. బీఈడీ, ఎంటెక్ తదితర కోర్సుల్లో మరో13 వేల మంది జాయినయ్యారు. మిగిలిన వారిలో ఎక్కువ మంది జాబ్‌లో చేరారు. డిగ్రీ, బీటెక్ కోర్సు తర్వాత క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్ ఎక్కువయ్యాయి. ఇది కూడా హైయ్యర్ ఎడ్యుకేషన్ వైపు వెళ్లకపోవడానికి కారణం.డిగ్రీ, పీజీ కోర్సుల్లో బయోమెట్రిక్ అటెండెన్స్‌ను యూనివర్సిటీలు అమలు చేస్తున్నాయి. స్టూడెంట్స్‌కు సరిపడా అటెండెన్స్ లేకపోతే హాల్‌టికెట్స్ ఇవ్వడం లేదు. స్కాలర్‌షిప్స్‌కూ అనర్హులవుతున్నారు. గతంలో కాలేజీకి రాకపోయినా నడిచిపోయింది. కానీ ఇప్పుడది కుదరట్లేదు. దీంతో చదువుతూ ఉద్యోగం చేసే అవకాశం లేకుండా పోయింది.
No comments:
Post a Comment