Breaking News

26/08/2019

మావోయిస్టులను తెలుగు సీఎంలు ధైర్యంగా ఎదుర్కొంటున్నారు

న్యూఢిల్లీ, ఆగస్టు 26 (way2newstv.in - Swamy Naidu
మావోయిస్ట్ సమస్యను ఎదుర్కోవడంలో తెలుగు రాష్ట్రాలు రోల్ మోడల్‌గా నిలిచాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రశంసించారు. దేశంలోని మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో పరిస్థితిని బేరీజు వేసేందుకు కేంద్ర హోంశాఖ నిర్వహిస్తున్న ఈ సమావేశంలో భద్రత, అభివృద్ధి, గిరిజన హక్కులపై చర్చించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితుల గురించి హోంశాఖ పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమావేశంలో మాట్లాడుతూ.. మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించారు. 
 మావోయిస్టులను తెలుగు సీఎంలు ధైర్యంగా ఎదుర్కొంటున్నారు
మధ్యాహ్నం సెషన్‌లో కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా, నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్‌ మహేంద్రనాథ్‌ పాల్గొన్నారు. తెలంగాణ నుంచి హోంమంత్రి మహమూద్‌ అలీ, డీజీపీ మహేందర్‌రెడ్డి, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, జార్ఖండ్‌ సీఎం రఘుబర్‌ దాస్‌, మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌, ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌, చత్తీస్‌గఢ్‌ సీఎం భాఘెల్‌, బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌, హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి, ఆయా రాష్ట్రాల డీజీపీలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు

No comments:

Post a Comment