Breaking News

09/08/2019

మున్నే‌రులో ఇసుక దొంగ‌లు

ఖమ్మం, ఆగస్టు 09, (way2newstv.in)
మున్నేరు పరివా హక ప్రాంతాలైన పెద్దమండవ, గంధసిరి గ్రామాల్లో కొందరు ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. అధికారులు పంపిణీ చేసే ఇసుక అక్రమార్కులను అందివచ్చిన  ఒక్కొ కూపన్‌ ద్వారా 3-5 ప్రక్కల ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. అక్కడికక్కడే అధికారులను మేనేజ్‌ చేసేకొని అందినకాడికి దోచుకుంటు న్నారు. ఫలితంగా గ్రామాలకు రావాల్సిన ఆదాయానికిగండిపడుతుంది. పెద్దమండవ, గంధసిరి గ్రామాల్లో అభివృద్ధి కమిటీ పేరుతో అక్రమదందా కొనసాగిస్తున్నారు. అడ్డుకోవాల్సిన అధికారులు మామూలు మత్తులో చేతులెత్తేస్తున్నారు. ఇటీవల ముదిగొండ తహశీల్ధార్‌ కార్యాలయంలో జాయింట్‌ కలెక్టర్‌ దివ్య మండల అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి అక్రమ ఇసుకదారులపై పీడీ యాక్ట్‌ పెట్టాలని హెచ్చరించినా మండల అధికారులు మాత్రం పెడచెవిన పెట్టారు. ఒక్క గంధసిరి గ్రామానికి ఇసుక రవాణా కోసం 95 ట్రాక్టర్లు ఉన్నాయంటే ఇసుక ద్వారా ఎంత గడిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
మున్నే‌రులో ఇసుక దొంగ‌లు

పెద్ద మండవ, గంధసిరి గ్రామాల్లో మరుగుదొడ్లు లేని ఇళ్ళు లేకపోవచ్చు గానీ ఇసుక నిల్వలు మాత్రం ఉన్నాయి.అధికారులు పంపిణీ చేసే కూపన్లు 12 గంటల మాత్రమే పని చేస్తాయి. అంటే ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే కూపన్లు ద్వారా ఇసుక రవాణా చేయాలి. కానీ పగలు, రాత్రి తేడా లేకుండా ఇసుక తరలిస్తున్న పట్టించుకునేవారు లేరు. మైనింగ్‌ అధికారులు దాడులు గానీ పర్యవేక్షణ లేదు.పెద్దమండవ, గంధసిరి గ్రామాల నుంచి తరలిస్తున్న ఇసుక పొరుగు జిల్లాలైన కృష్ణ, నల్గొండ జిల్లాలోని పలు గ్రామాలకు తరలిస్తున్నాయి. స్థానికంగా ఉన్న అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పర్సంటేజీలు మాట్లాడుకొని అక్రమంగా ఇసుకను తరలించడం వలన ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతుంది.గంధసిరి గ్రామ పంచాయతీ మున్నేరు నుంచి ఇసుకను రవాణా చేయడం ద్వారా కోటి రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు చెబుతున్నారు. గ్రామంలో మాత్రం అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. ప్రజలకు ఉపయోగపడే ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం గ్రామ పంచాయతీ పాలన వర్గం గానీ అధికారులు గానీ చేపట్టలేదు. కోటి రూపాయల ఆదాయం రూ. 35 లక్షలు డ్రా చేసి నామమాత్రంగా రోడ్ల గుంతలు పూడ్చి లెక్కలు చెబుతున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

No comments:

Post a Comment