Breaking News

10/08/2019

లాభాలు పండిస్తున్న మొక్క జొన్న

నిజామాబాద్, ఆగస్టు 10, (way2newstv.com)
చలికాలం, వర్షాకాలం సీజన్‌లకు మజా తెచ్చే ఆహార పదార్థం ఏదైనా ఉన్నదంటే అది మొక్కజొన్న మాత్రమే.చలి పెడుతుంటే వేడివేడిగా మొక్కజొన్న కంకి తింటే వారెవ్వా..మస్తు మజా ఉంటది కదా! మొక్కవోని ఆరోగ్యానికి మొక్కజొన్న ఇచ్చే పోషకాలు కూడా అనేకమం  టున్నారు.అసలు ఆ మొక్కజొన్న కథ ఏమిటో చూద్దాంఎందుకు ఆలస్యం పదండి..తెలుగు రాష్ట్రాలలో పండించే పంటలలో మొక్కజొన్న ముఖ్యమైనది. ఈ పంటను ఖరీఫ్ లో సుమారుగా 5.0 లక్షల హెక్టార్లు, రబీలో సుమారుగా 3.8 లక్షల హెక్టార్లలో సాగుచేస్తున్నారు. ఈ పంట లాభసాటిగా ఉండటం వలన అన్ని కోస్తా ఆంధ్ర జిల్లాలలో మరియు కొన్ని రాయలసీమ, తెలంగాణా జిల్లాలలోను సాగు చేయుచున్నారు.ఐతే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సుమారుగా ఒక్కలక్ష75వేలఎకరాల్లో మొక్క జొన్న పంటనుపండిస్తారు.
లాభాలు పండిస్తున్న మొక్క జొన్న

ముఖ్యంగా ఆర్మూర్,నిజామాబాద్, కామారెడ్డి, ఎల్లారెడ్డి డివిజన్ లలలో అత్యదికంగా పండిస్తారు.మొక్కజొన్న విత్తనోత్పత్తి, నిల్వ పద్ధతి, సాగు పద్ధతులు, పంట యాజమాన్యం పద్దతులలో సాగు చేస్తారు.మొక్కజొన్నపంటను నిజామాబాద్ జిల్లా అంకాపూర్ మార్కెట్ అనువైనది.ఇక్కడికి అంకాపూర్ చుట్టూపక్కల ప్రాంతగా ప్రజలేకాక ఆదిలాబాద్,కరీంనగర్ జిల్లారైతులు మొక్కజొన్నను విక్రయా నికి తెస్తారు.ఈసారి వర్షాలు ఆలస్యం కావడంతో రైతులు పండించిన పంటకు అధిక ధరలు వస్తున్నాయని,గతంలో ఎన్నడు లేని విధంగా ఈ సంవత్సరంఎకరాకు 70 వేల రూపాయలు వస్తున్నాయని,పండించిన పంటకు లాభాలు వస్తున్నాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ప్రతిరోజు ఉదయం7గంటలకు మార్కెట్ ప్రారంభమవుతుందని,10గంటలవరకు క్లోజ్ అవుతుం దని,ఇక్కడి మార్కెట్ నుండి  తెలంగాణా జిల్లాలతోపాటు మహా రాష్ట్ర లోని నాగపూర్,నాందేడ్, పర్బని,ముంబై,కర్ణాటక లోని బెంగళూర్,మైసూర్,అంధ్రప్రదేశ్ లోని విజయవాడ,విశాకపట్నం, అమరావతి, కర్నూల్,కడప తిరుపతిలకు ఎగుమతవుంది.ఐతే గతంలో కంటే ఈఏడూ లాభాలు తక్కువ అయిన వ్యాపారం చేస్తున్నామని,ఈ కచ్చ వ్యాపారం కేవలం రెండు నెలలు మాత్రమే ఉంటుందని వ్యాపారాలు చెపుతున్నారు.మొక్కజొన్నలో కేలరీలు తక్కువగా, పోషక పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. వందగ్రాముల స్వీట్‌కార్న్‌లో 86 కేలరీలుంటాయి.పీచు పదార్థాలు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి.వృద్ధ్యాప్య ఛాయలు దరి చేరకుండా చూసుకోవడంలో మొక్కజొన్న సమర్థవంతంగా పనిచేస్తుంది.స్వీట్‌కార్న్‌లో ఉండే ప్రత్యేకమైన బి విటమిన్లు కంటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇందులో ఉండే ఫోలెట్గుండె సంబధ వ్యాధులను దరిచేరకుండా కాపాడుతుంది. మొక్కజొన్నలో ఉండే థయామిన్ మెదడు పనితీరును మెరుగు పరుస్తుందని నిపుణుల చెపుతున్నారు.మొక్కజొన్న పొత్తును మనం దోవన పోతుంటే పొత్తులను వేసుకుని బండి వాడు వస్తే తీసుకుని ఏదో సరదాగా తింటుంటాం. కానీ మనకు ఆరోగ్యంతో పొత్తు కుదిర్చే అద్భుతమైన శక్తి దానికి ఉంది. సరదాగా తినేప్పుడు సంతోషం కూడా కలుగుతుంది కదా. మొక్కజొన్నలో సంతోషభావనను పెంచే రసాయనాలైన ఫ్లేవనాయిడ్స్‌ ఉన్నాయని చెబుతున్నారు.ఏదేమైనా మొక్కజొన్న కంకుల రుచియే వేరబ్బ.....

No comments:

Post a Comment