Breaking News

10/08/2019

ప్లాస్టిక్ వాడితే.... పెనాల్టీయే...

హైద్రాబాద్, ఆగస్టు 10, (way2newstv.in)
గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 50 మైక్రాన్ల కంటే తక్కువగా ఉన్న ప్లాస్లిక్‌ను ఉపయోగించడాన్ని జీహెచ్‌ఎంసీ నిషేధిం చింది. నగరంలో పెద్ద ఎత్తున వ్యాపారవాణిజ్య సముదాయాల్లో తనిఖీలు జరిపేందుకు ప్రత్యేక బృందాలను కూడా రంగంలోకి దింపింది. 50 మైక్రాన్ల కంటే తక్కువగా ఉన్న ప్లాస్టిక్‌ను వాడితే ఊపేక్షించేది లేదని హెచ్చరికలు కూడా జారీ చేస్తోంది. పర్యావరణానికి ప్రతికూలంగా మారిన ప్లాస్టిక్‌ ఉపయోగంపై ఆంక్షలు లేకపోతే రానున్న కాలంలో మానవళి మనుగడకు ప్రమాదక రంగా మారే అవకాశాలున్నాయి. ప్లాస్టిక్‌ వ్యర్థాలతో నగరంలో నాలాలు, డ్రెయినేజీల్లో తరచూ మురుగునీరు ఓవర్‌ప్లో కావడం, నాలాలు మూసుకుపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. బిర్యానీ ప్యాకింగ్‌లకు ఉపయోగించే సిల్వర్‌ కవర్లు, షాంపూ, గుట్కా ప్యాకెట్లు, చిరు ఆహారాల ప్యాకెట్లతో తీవ్ర ఇబ్బం దులు ఎదురవుతాయి. 
ప్లాస్టిక్ వాడితే.... పెనాల్టీయే...

అయితే నగరంలో వచ్చే వ్యర్థాల్లో 70 శాతం ప్లాస్టిక్‌ వ్యర్థాలే ఉండడం విశేషం. అయితే గతంలో 40 మైక్రాన్ల ప్లాస్టిక్‌ బ్యాగ్‌లు, కవర్లపై నిషేధం ఉండగా, దీన్ని 50 మైక్రాన్లకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీచేసిన విషయం విధితమే. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం గ్రేటర్‌ పరిధిలో ప్లాస్టిక్‌ నిషేధాన్ని కఠినతరం చేయాలని, ఈనెల ఒకటో తేదీ నుంచి పక్కాగా నిషేధం అమలుచేస్తోంది. ఇప్పటికే నగరంలో ప్లాస్టిక్‌ వ్యర్థాల నిర్వహణపై ప్లాస్టిక్‌ ఉత్పత్తుల తయారీదారులు, ట్రేడర్ల, హోటల్స్‌, మాల్స్‌ ప్రతినిధులతో అవగాహనా కార్యక్రమాలు నిర్వహించి, కఠిన చర్యలు తీసుకుంటామని కూడా జీహెచ్‌ఎంసీ హెచ్చరికలు చేసింది. ఈ క్రమంలోనే 50 మైక్రాన్ల కన్నా తక్కువ ప్లాస్టిక్‌ కవర్లను వాడకుండా నిరోధించేందుకు చిరువ్యా పారుల, హోటళ్లు, పండ్ల బండ్లు, ఫుట్‌పాత్‌ వ్యాపారస్తులు తదితరులకు అవగాహన కల్పించారు.నగరంలోని ప్రతి వ్యాపార, వాణిజ్య సంస్థలు, దుకాణాదారులు విధిగా 50 మైక్రాన్ల కన్నా అధిక ప్రమాణాలు కలిగిన ప్లాస్టిక్‌ క్యారీబ్యాగ్‌లను మాత్రమే వినియోగించేందుకు జీహెచ్‌ఎంసీ ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది. భారత ప్రామాణిక సంస్థ నిర్ధారించిన మేరకు ప్లాస్టిక్‌ కవర్లను విక్రయిం చాలని ఈ విషయంలో సర్కిళ్లవారీగా మానిట రింగ్‌ కమిటీలను నియమించారు. 50 మైక్రాన్ల కంటే తక్కువ ప్లాస్టిక్‌ను వాడే వ్యాపార, వాణిజ్య సముదాయాల్లో ప్రతిరోజు తనిఖీలు నిర్వహించాలని జీహెచ్‌ఎంసీ ఆదేశించింది. జోనల్‌ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, ఏఎంహెచ్‌ఓలు, కిందిస్థాయి అధికారులు తనిఖీలు నిర్వహించనున్నారు. 50 మైక్రాన్ల కంటే తక్కువ ప్లాస్టిక్‌ను వాడేవారిపై మొదటిసారి రూ.పది వేలు, రెండోసారి రూ.25 వేలు జరిమానా వేయనున్నారు. మూడో సారి కూడా పట్టుబడితే సంబంధిత దుకాణాన్ని సీజ్‌ చేస్తామని హెచ్చరించారు.

No comments:

Post a Comment