Breaking News

10/08/2019

సారథి ఎంపిక కోసం ఐదు కమిటీలుగా విడిపోయిన సీడబ్ల్యూసీ

అర్ధంతరంగా వెళ్లిపోయిన పార్టీ అగ్రనేతలు సోనియా,రాహుల్‌ గాంధీ
న్యూ డిల్లీ ఆగష్టు 10  (way2newstv.in)
రాహుల్‌ రాజీనామాతో కొత్త అధ్యక్షుడి ఎన్నిక అనివార్యమైంది. ఇందుకోసం సీడబ్ల్యూసీ నేడు భేటీ అయ్యింది. కొత్త అధ్యక్షుడి ఎన్నిక కోసం జరుగుతున్న కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశం నుంచి ఆ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ అర్ధంతరంగా వెళ్లిపోయారు. సారథి ఎంపిక కోసం సీడబ్ల్యూసీ ఐదు కమిటీలుగా విడిపోయింది. అయితే ఈ కమిటీల్లో తమ పేర్లను చేర్చడంపై సోనియా, రాహుల్‌ అసహనానికి గురయ్యారు. ఎంపిక బృందాల్లో తమ పేర్లను పొరపాటుగా చేర్చారని.. 
 సారథి ఎంపిక కోసం ఐదు కమిటీలుగా విడిపోయిన సీడబ్ల్యూసీ 

అధ్యక్ష ఎంపిక కమిటీల్లో తాముండటం సబబు కాదని పేర్కొంటూ వారిద్దరూ భేటీ నుంచి మధ్యలోనే బయటకొచ్చారు. అధ్యక్ష ఎన్నిక పారదర్శకంగా జరగాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. దీనిపై సోనియా గాంధీ మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం కొత్త అధ్యక్షుడి ఎంపిక కోసం సంప్రదింపులు జరుగుతున్నాయి. సహజంగానే నేను, రాహుల్‌ ఆ చర్చల్లో భాగస్వాములుగా ఉండలేం’ అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష రేసులో ముకుల్ వాస్నిక్, మల్లికార్జున ఖర్గే, సుశీల్ కుమార్ షిండే వంటి నేతల పేర్లు వినిపిస్తున్నాయి. యువ నేతలైన జ్యోతిరాదిత్య, సచిన్ పైలెట్ పేర్లూ తెరపైకి వచ్చాయి. సంప్రదింపుల ద్వారా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎవరు సరిపోతారో నిర్ధారించనున్నారు. పార్టీలో అంతర్గతంగా ఎన్నికలు నిర్వహిస్తే… నాయకులు రెండు వర్గాలుగా విడిపోయే ప్రమాదం ఉందని కొందరు నేతలు సూచించడంతో సంప్రదింపులతోనే తేల్చేయాలని నిర్ణయించారు.  

No comments:

Post a Comment