హైదరాబాద్ ఆగష్టు 26 (way2newstv.in - Swamy Naidu)
తెలంగాణ హైకోర్టు జడ్జీలుగా జస్టిస్ వినోద్ కుమార్, జస్టిస్ అభిషేక్ రెడ్డి, జస్టిస్ లక్ష్మణ్ ప్రమాణస్వీకారం చేశారు. ఈ ముగ్గురు జడ్జీల చేత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్ ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి న్యాయవాదులు, హైకోర్టు సిబ్బంది హాజరయ్యారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని కొలీజియం తెలంగాణ హైకోర్టుకు చెందిన న్యాయవాదులు తడకమళ్ల వినోద్‌కుమార్, అన్నిరెడ్డి అభిషేక్‌రెడ్డి, కూనూరు లక్ష్మణ్‌లను న్యాయమూర్తులుగా నియమించాలని ఇటీవల రాష్ట్రపతికి సిఫారసు చేసింది.
హైకోర్టు జడ్జీలుగా జస్టిస్ వినోద్ కుమార్, అభిషేక్ రెడ్డి, లక్ష్మణ్‌లప్రమాణస్వీకారం
కొలీజియం సిఫారసులను రాష్ట్రపతి యథాతథంగా ఆమోదించిన సంగతి తెలిసిందే. 14కు చేరిన న్యాయమూర్తుల సంఖ్య..తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను 24గా అప్పట్లో నిర్ధారించారు. జనవరి 1న 13 మంది ప్రమాణం స్వీకరించారు. ఇందులో ఒకరు రిటైర్‌కాగా మరో ఇద్దరు బదిలీపై వెళ్లారు. దీంతో వీరి సంఖ్య పదికి తగ్గింది. తర్వాత జస్టిస్ గండికోట శ్రీదేవి చేరికతో ఈ సంఖ్య 11కు పెరిగింది. ప్రస్తుతం మరో ముగ్గురి నియామకంతో 14కు చేరింది. హైకోర్టులో ఇంకా పదిమంది న్యాయమూర్తులను భర్తీచేయాల్సి ఉన్నది. మరోవైపు మొత్తం న్యాయమూర్తుల సంఖ్యను 42కు పెంచాలని న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నారు.
No comments:
Post a Comment