నంగునూరు,ఆగస్టు14(way2newstv.in - Swamy Naidu)
నంగునూరు గ్రామనికి చెందిన ఆవుల నర్సవ్వ లక్ష్మయ్యల కూతురు వివాహానికి జ్యోతి స్వచంద సంస్థ అధ్యక్షులు మంద పాండు కార్యదర్శి తెలజి శ్రీనివాస్ యాదవ్ లతో కలిసి బుధవారం పుస్తెమట్టలనుఅందజేశారు. నంగునూరు కు చెందిన దేవులపల్లి స్వరూప నరేష్ వివాహానికి టీపీసీసీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దేవులపల్లి యాదగిరి పుస్తే మట్టెలను వధూవరులకు అందించారు . అనంతరం వారు మాట్లాడుతూ నిరుపేదలకు సహాయం చేయడం గొప్ప ధైర్యమని అన్నారు పేదవారికి చేసే సహాయంలో ఉన్న తృప్తి మరెందులో ఉండదన్నారు. ఇలాంటి పేదవారికి విద్యకోసం కూడా ఎంతోమందికి చేయూతనిచ్చామని తెలియజేశారు. భవిష్యత్తులో ఇలాంటి వివాహాలకు మా జ్యోతి స్వచంద సంస్థ ద్వారా చాల సామజిక కార్యక్రమాలు చేస్తామని స్పష్టం చేశారు అడిగిన వెంటనే స్పందించి చేతనిచ్చిన జ్యోతి స్వచ్చంద వారికి మరియు దేవులపల్లి యాదగిరి కి అమ్మాయి తల్లి దండ్రులు పెద్దమ్మ పెద్దనాన్న బంధువులు కృతజ్ఞతలు తెలిపారు.
పేద వదువులకు పుస్తె మట్టెల బహుకరణ ..
స్వార్థం పెరిగిపోయిన ఈ రోజుల్లో ఇలాంటి స్వచ్చంద సంస్థ ద్వారా పేదవారికి ఆదుకుని చేయూతనివ్వడం హర్శించదగ్గ విషయమని దేవులపల్లి యాదగిరి అన్నారు. వారికీ దేవుడు ప్రతి పనిలో తోడు ఉండాలని దేవుణ్ణి కోరాడు. ఈ కార్యక్రమములో ,గుంటిపల్లి శ్రీనివాస్,చెలికాని యాదగిరి ,మద్దెబొయిన నరేందర్ ,జ్యోతి డైరెక్టర్ రాజన్న ,దాసరి కిషన్ , జంగిటి శ్రీను , హరిప్రసాద్, సాదుల పవన్ , దేవులపల్లి,కృష్ణ,దేవులపల్లి,సురేష్ పల్లాటి రాజు ,పోచయ్య ,దేవులపల్లి కనకరాజు ,రాగుల కృష్ణ పాపిగారి లక్ష్మణ్ , పర్శరాములు ,పోచయ్య , శ్రీకాంత్ ,,రాంబాబు రాజేందర్ ,ప్రసాద్,నాగరాజు జిడ్డి దుర్గయ్య ,రాజయ్య ,కనకయ్య లు పాల్గొన్నారు.
No comments:
Post a Comment