Breaking News

14/08/2019

అడ్రస్ లేని స్వచ్ఛభారత్.... ఆందోళనలో ప్రజలు

వనపర్తి  ఆగస్టు 14 (wat2newstv.in - Swamy Naidu)
గోపాల్ పేట లోని పోచమ్మ గడ్డ న్యూ కాలనీలో మురుగునీరు వీధుల్లో ప్రవహిస్తూ నడవటానికి నరకయాతన సృష్టించడంతో అడ్రస్ లేని స్వచ్ఛభారత్ అని ప్రజలు, మహిళలు తీవ్ర స్థాయిలో విమర్శించ సాగారు. కాలనీలో మురుగు కాలువలు, ఇంటర్నల్ రోడ్లు లేకపోవడమే కాకుండా వీధి దీపాలు అంతంతమాత్రంగా ఉండటంతో ఇదేమి పరిపాలన అంటూ వారు విమర్శించారు. వాడలలో, కాలనీలలో  మురుగు కాలువలు నిర్మించడమే కాకుండా సిసి రోడ్లను ఏర్పాటుచేసి స్వచ్ఛ భారత్ కు నాంది పలకాలని అధికారులు, నాయకులు అంటున్నారే తప్ప ఈ దుస్థితి వారికి అగుపించటం లేదని కాలనీవాసులు వారిని ప్రశ్నిస్తున్నారు. 
అడ్రస్ లేని స్వచ్ఛభారత్.... ఆందోళనలో ప్రజలు
విరి నిర్లక్ష్యం వల్ల మురుగునీరు వీధుల్లో ప్రవహిస్తూ నడవటానికి లేకుండా పోయింది. అదేవిధంగా కాలనీలో ఒకపక్క మురుగు నీటి ప్రవాహాలు, ఈగలు దోమలు మరోపక్క పందులు, పాముల సంచారాలు అధికంగా ఉండటం వల్ల ఆ కాలనీవాసులకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. దీని దృష్ట్యా అధికారులు నాయకులు వెంటనే స్పందించి కాలనీలో మురుగు కాలువలను నిర్మించి వీధి రోడ్లను ఏర్పాటుచేసి కాలనీవాసులకు సౌకర్యం కలిగించాలని వారు కోరుతున్నారు

No comments:

Post a Comment