Breaking News

14/08/2019

ప్లాస్టిక్ రహిత మండలంగా తీర్చిదిద్దాలి

స్పెషల్ ఆఫీసర్ కోదండరాములు
వనపర్తి ఆగస్టు 14 (way2newstv.in)
మండల కేంద్రమైన గోపాల్ పేట లో ఎవరు కూడా ప్లాస్టిక్ బ్యాగులను వాడకుండా మండలాన్ని ప్లాస్టిక్ రహిత మండలంగా తీర్చిదిద్దాలని స్పెషల్ ఆఫీసర్ కోదండరాములు పిలుపునిచ్చారు. ఆయన బుధవారం మండల కేంద్రమైన గోపాల్పేట లో పంచాయతీ కార్యదర్శి రాఘవేంద్ర రావు, సర్పంచ్ శ్రీనివాసులు, మరియుఆశ,మహిళా సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహిస్తూ ప్రతి షాపును సందర్శించి ప్లాస్టిక్ సంచులను రూపుమాపాలంటూ హెచ్చరికలు జారీ చేశారు.
ప్లాస్టిక్ రహిత మండలంగా తీర్చిదిద్దాలి

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఏ షాపు యజమాని కూడా ప్లాస్టిక్ సంచులను వినియోగించరాదని ముఖ్యంగా వాడరాదని వారన్నారు. ఒకవేళ ఏ షాపు యజమాని ప్లాస్టిక్ సంచులను అమ్మిన, వినియోగించిన వారిపై చర్యలు తీసుకొని జరిమానా విధిస్తామని వారు హెచ్చరించారు.

No comments:

Post a Comment