Breaking News

27/08/2019

జల సద్వినియోగంమే జల్ శక్తి సైంటిస్ట్ మస్తానయ్య

వనపర్తి ఆగష్టు 27  (way2newstv.in - Swamy Naidu)
జలం అనగా నీరు అటువంటి నీటిని ఎలా పొదుపు చేసుకోవాలన్నది జల్ శక్తి ని కె. వి. కె సైంటిస్ట్ మస్తానని అన్నారు. ఆయన మంగళవారం వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం చాకల్ పల్లి గ్రామంలో వ్యవసాయ మరియు కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన జల్ శక్తి అభియాన్ శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా జల శక్తి అభియాన్ , నీటి పొదుపు పై ఆయన రైతులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామంలోని రైతులు అందరు కూడా జలాన్ని అంటే నీటినిఎలా ఉపయోగించుకోవాలన్నదే జల్ శక్తి ముఖ్య ఉద్దేశమని ఆయన అన్నారు. 
జల సద్వినియోగంమే జల్ శక్తి  సైంటిస్ట్ మస్తానయ్య
రైతులుఅందరుకూడా జలాన్ని భూమిలో నిల్వ ఉంచడానికి ఇంకుడు గుంతలు మొదలు వాటిని నిర్మించుకొని నీటిని నిల్వలు చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి నరేష్ మాట్లాడుతూ ఎప్పుడైతే నీరు సమృద్ధిగా ఉంటుందో అప్పుడే రైతులు వారి పొలం సాగు చేసుకుని పంటలు పండించుకునే అవకాశాలు ఉన్నాయని ఆయన అన్నారు. అందుకోసం రైతులందరూ కూడా నీటి యొక్క ప్రాముఖ్యత ను సైంటిస్టులు ద్వారా తెలుసుకుని నీటి నిల్వను తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో కె.వి.కె సైంటిస్ట్ విజయ్ కుమార్ తో పాటు రైతులు వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment