Breaking News

27/08/2019

క్యూ నెట్ కేసులో 70 మంది అరెస్ట్

హైద్రాబాద్, ఆగస్టు 27  (way2newstv.in - Swamy Naidu)
క్యూనెట్ స్కామ్ లో ఇప్పటి వరకు 70 మందిని అరెస్ట్ చేశామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ వెల్లడించారు. ఈ స్కామ్ కు సంబంధించి మొత్తం 38 కేసులు నమోదయ్యాయని చెప్పారు. 12 మందిపై లుకౌట్ నోటీసులు జారీ చేశామని తెలిపారు. క్యూనెట్ ను ప్రమోట్ చేసిన సినీ ప్రముఖులందరికీ నోటీసులు పంపామని చెప్పారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగులే లక్ష్యంగా క్యూనెట్ కుంభకోణం జరిగిందని తెలిపారు. సంస్థలో పని చేస్తున్న సొంత ఉద్యోగులను కూడా మోసం చేసిందని చెప్పారు. క్యూనెట్ బాధితులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని... ఇకపై ఎవరూ అందులో పెట్టుబడులు పెట్టవద్దని సూచించారు. మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతో ఆ సంస్థ మోసాలకు పాల్పడుతోందని చెప్పారు.క్యూనెట్‌ కంపెనీకి సంబంధం లేని వ్యక్తులు కూడా పెట్టుబడుల్లో వచ్చిన డబ్బుని వాడుకుంటున్నారని, దేశ వ్యాప్తంగా క్యూనెట్‌ సంస్థ 5 వేల కోట్ల రూపాయలు మోసం చేసినట్లు విచారణలో వెల్లడైనట్లు తెలిపారుఈ సంస్థపై అనేక ఫిర్యాదులు అందడంతో ఈ కేసును లోతుగా విచారించాలని రిజిస్టార్‌ ఆఫ్ కంపెనీస్‌ ఆదేశాలు ఇచ్చిందన్నారు. 
క్యూ నెట్ కేసులో 70 మంది అరెస్ట్
15 రోజుల క్రితం క్యూనెట్‌ బాధితుడు ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ సైబరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్నాడని, మరో వ్యక్తి సూసైడ్‌ నోట్‌ రాసి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. ఈ క్యూనెట్ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖులు దేశం దాటి పోకుండా 12 మందిపై లుక్ ఔట్ నోటీసులు ఇచ్చినట్లు వెల్లడించారు. కేవలం డబ్బులు వసూలు చేయడమే వీరి పని అని, ఇలాంటి మార్కెటింగ్‌ మోసాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సీపీ సూచించారు. క్యూనెట్‌కు ఎలాంటి రికార్డులు లేవని, రూ.100 విలువ చేసే వస్తువు రూ.1500 కి అమ్మకాలు చేస్తూ మోసాలకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు. బ్యాంకు ఉద్యోగులను మోసం చేసిన ముఠా గుటు రట్టు అయ్యింది. బ్యాంక్‌ ఉద్యోగులను మోసం చేస్తూ కోట్లు కొల్లగొడుతున్న గ్యాంగ్‌ను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ముఠాకు చెందిన నలుగురిని అరుణ్‌, లోకేష్‌ తోమర్‌, మోహిత్‌ కుమార్‌, మనోజ్‌ కుమార్‌ను అరెస్టు చేసినట్లు కమిషనర్‌ సజ్జనార్‌ వెల్లడించారు. పెద్ద కార్ల షో రూమ్‌లను వేదికగా చేసుకొని దేశ వ్యాప్తంగా భారీ మోసాలు చేస్తూ అనేక మందిని మోసం చేసినట్లు పేర్కొన్నారు. కావున బ్యాంకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని, సరైన సమాచారం లేకుండా డబ్బులు బదిలీ చేయవద్దని సూచించారు. నిందితుల నుంచి మూడు లక్షల నగదుతోపాటు ఏడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

No comments:

Post a Comment