Breaking News

13/08/2019

అసంతృప్తి స్థాయి ఒక శాతం కన్నా తక్కువుండాలి

అమరావతి  ఆగస్ట్  13(way2newstv.in - Swamy Naidu):
స్పందన కార్యక్రమంపై ముఖ్యమంత్రి  వైయస్.జగన్ మోహన్ రెడ్డి సమీక్ష జరిపారు. మంగళవారం జరిగిన ఈ భేటీలో స్పందన వినతుల పరిష్కారంపై చర్చించారు.  సీఎం మాట్లాడుతూ స్పందన కింద వచ్చే వినతుల సంఖ్య బాగా పెరుగుతోంది. జులై 31 నాటికి 1,08,997 వచ్చాయి. జులై మొదటివారంలో వచ్చిన వినతులు కేవలం 34,541 మాత్రమే. ప్రజల సమస్యలపట్ల స్పందిస్తున్నందునే వినతుల సంఖ్య పెరిగిందని అన్నారు. అధికారులు అందరికీ అభినందనలు తెలిపిన ముఖ్యమంత్రి ప్రజలంతా స్పందన కార్యక్రమాన్ని బాగా వినియోగించుకుంటున్నారు. సమస్యల పరిష్కారంలో నాణ్యతపై కలెక్టర్లు, ఎస్పీలతో వివరంగా మాట్లాడారు.క్రమం తప్పకుండా కాల్ సెంటర్ల ద్వారా ప్రజలకు ఫోన్ చేసి వారి అభిప్రాయాలు తీసుకుంటాం. ఎమ్మార్వోలు, ఎస్సైలు,కలెక్టర్లు, ఎస్పీలు బాగా స్పందిస్తున్నారా? లేదా? అని తెలుసుకుంటాం, సర్వేలు కూడా చేస్తాం. 90శాతం వినతులు పరిష్కారం అవుతున్నాయి. 

 అసంతృప్తి స్థాయి ఒక శాతం కన్నా తక్కువుండాలి
90శాతం మంది సంతృప్తి వ్యక్తంచేస్తుంటే.. అది చాలామంది పరిణామం అని చెప్పొచ్చు. అసంతృప్తితో ఉన్నవారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుని వారి సమస్యలనూ మనం పరిష్కరించడానికి ప్రయత్నించాలని అన్నారు. అసంతృప్తిస్థాయి 1 శాతం కన్నా తక్కువే ఉండాలి. రాష్ట్రవ్యాప్తంగా వినతుల పరిష్కారంలో అసంతృప్తి స్థాయి సగటు 9.5శాతం కన్నా ఉంది. అనంతపురంలో 13.9, చిత్తూరులో 10.3, తూర్పుగోదావరి 12.83, కృష్ణాలో 11.74 శాతం వినతుల పరిష్కార నాణ్యతలో అసంతృప్తి స్థాయి ఉంది. వినతుల పరిష్కారంలో క్వాలిటీమీద ఎక్కువ దృష్టిపెట్టాలి. అసంతృప్తిస్థాయిని 1 శాతం కన్నా తక్కువగా ఉండాలి, ఇది కష్టమే అయినా సాధించాలని అన్నారు. మన ఇంట్లో మనిషి పలానా సమస్య ఉందని పిటిషన్ ఇస్తే మనం ఎలా స్పందిస్తామో.. అలాంటి స్పందనే ప్రతి అధికారీ వ్యక్తంచేయాలి:అప్పుడే అసంతృప్త స్థాయి 1 శాతం లోపల ఉంటుందని అన్నారు. కలెక్టర్ నుంచి దిగువస్థాయి అధికారి వరకూ దీన్ని లక్ష్యంగా చేసుకోవాలి. అలాగే తిరస్కరించిన వినతుల రాష్ట్రస్థాయి సగటు 7.6శాతం ఉంది. పశ్చిమ గోదావరి లో 16శాతం,చిత్తూరులో 13.5, అనంతపూర్లో 8.5, ప్రకాశంలో 8.2శాతం ఉంది, వీటిమీద కూడా దృష్టిపెట్టాలని సూచించారుఉ. ఇసుక కొరత ఎక్కువగా ఉందని మనకు ఫీడ్ బ్యాక్ వస్తోంది: సీఎం
నిర్మాణాత్మకంగా ఈసమస్యను పరిష్కరించాలి. ఇసుకలో అవినీతి ఉండకూడదు. గత ప్రభుత్వంలో మాదిరిగా ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర వ్యక్తులు ఒక సామాజ్యం మాదిరిగా మారకూడదనేది మన అభిప్రాయం. అవినీతి లేకుండా ఇప్పుడు చూడగలిగాం, మాఫియా, లూటీ అన్నది పోయింది. ఇది చేస్తూనే ఇసుకను మనం అందుబాటులో ఉంచగలగాలని అన్నారు.  ఇంతకు ముందు లూటీ జరిగింది, లూటీ జరక్కుండా ఇసుకను అందుబాటులో ఉంచాలి. ఇదివరకే అధికారులను అడిగితే.. కొన్ని సలహాలు ఇచ్చారు, ఆమేరకు కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. ఇప్పుడున్న 65 రీచ్లనుంచి సరిపడా ఇసుకను ఇవ్వలేమని అన్నారు. 

No comments:

Post a Comment