Breaking News

13/08/2019

హరితహారంలో అందరూ భాగస్వాములు కావాలి నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలి: హరితాహారం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్

వేములవాడ   ఆగస్ట్  13(way2newstv.in - Swamy Naidu):
హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ఆ మొక్కలను సంరక్షించాల్సిన బాధ్యతను కూడ తీసుకోవాలని జిల్లా  కలెక్టర్  కృష్ణ భాస్కర్ అన్నారు.మంగళవారం ఐదో విడత హరితహారం లో భాగంగా వేములవాడ మున్సిపాలిటీ పరిధిలోని శాత్రాజుపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో మున్సిపల్ ,యువ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన హరితహారం కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ ,సహాయ కలెక్టర్ బి.సత్యప్రసాద్ లు పాల్గొని   మొక్కలు నాటారు.  ఈ సందర్భంగా కలెక్టర్  కృష్ణ భాస్కర్   మాట్లాడుతూ.. భవిష్యత్ తరాల మనుగడకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. హరితహారం కార్యక్రమం లో యువత కూడా భాగస్వాములు కావాలని ఆయన అన్నారు. జిల్లాలో 19 శాతం మేర  మాత్రమే అడవులున్నాయని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా ఉండాలంటే 33 శాతం అడవులుండాలన్నారు. 

 హరితహారంలో అందరూ భాగస్వాములు కావాలి  నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలి:   హరితాహారం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్  కృష్ణ భాస్కర్
దానికి అనుగుణంగా ప్రతి ఒక్కరు విరివిగా మొక్కలు నాటి  పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని తెలిపారు. మొక్కలు నాటడమే కాకుండా  మొక్కల సంరక్షణ పై  ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. రాష్ట్రం లోని మిగతా జిల్లాలతో పోల్చుకుంటే ఇప్పటివరకు నాటిన మొక్కలను సంరక్షించడంలో మన రాజన్న సిరిసిల్ల జిల్లా మొదటి స్థానంలో ఉందని కలెక్టర్ అన్నారు.సహాయ కలెక్టర్  బి.సత్యప్రసాద్ మాట్లడుతూ విధులలో తోలి రోజే  హరిత హారం కార్య క్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందని అన్నారు. యువత ఇలాంటి సమాజ హిత కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ , సహాయ కలెక్టర్ లు  జిల్లా పరిషత్ పాఠశాలలో డిజిటల్ తరగతులను ప్రారంభించారు .కార్యక్రమంలో వేములవాడ మున్సిపల్ కమీషనర్ . గంగారాం, యువ ఫౌండేషన్ వ్యవస్థాపకులు గొడిసెల రాజశేఖర్, పాఠశాల ఉపాధ్యాయులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment