Breaking News

21/08/2019

వ్యవసాయ పనుల్లో ఆర్కే

గుంటూరు, ఆగస్టు 21 (way2newstv.in - Swamy Naidu
ఆళ్ల రామకృష్ణారెడ్డి అలియాస్ ఆర్కే.. మంగళగిరి ఎమ్మెల్యేగా అందరికి పరిచయం ఉన్న పేరు. సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆళ్ల.. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకపోయినా వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యారు. మంత్రి పదవి కూడా దక్కాల్సింది.. సామాజిక సమీకరణాలతో దూరమయ్యింది. ఇక ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలిచినా ఆర్కే మాత్రం తన మూలాలను మర్చిపోలేదు. ఇప్పటికీ ఓ సాధారణ రైతు బిడ్డగా వ్యవసాయం చేస్తున్నారు. ఓవైపు ప్రజా ప్రతినిధిగా తన నియోజకవర్గ బాధ్యతల్ని చూసుకుంటూనే.. మరోవైపు తన పొలాన్ని సాగు చేస్తున్నారు. తాజాగా ఆర్కే తన పొలంలో వరినాట్లు వేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ‘ఈ రోజు మాచేలో పొలంలో వరి నాట్లు వేయటం జరిగింది.. 
వ్యవసాయ పనుల్లో ఆర్కే
ఒక ఎకరానికి రైతుకు ఖర్చు.. నారు-రూ.4000/-, నాట్లుకు-2600/-, పొలం దున్నినందుకు రూ.1200/-, దమ్ము చేసినందుకు-1000/-, ఎరువులు-1600/-, ఇతర కూలీ ఖర్చు-1000/-, మొత్తం ఇప్పటికినాకు రూ.11400/-. పంట చేతికొచ్చే సరికి సుమారు రూ.25000/-. సొంత పొలం అయితే ఎకరానికి 35 బస్తాలు పండుతుంది. అంతా బాగుంటే రెండో పంట సరిగా మిగిలితేనే రైతు, కూలీ కాస్త నవ్వగలిగేది. అందుకే ప్రతి ఒక్కరూ ప్రతినెలా తమ ఊళ్ళల్లో ఉన్న పొలాలు చూడాలి ఒక్కసారన్నా’ అంటూ పిలుపునిచ్చారు. ‘ఒక్కపూట చేలో పనిచేస్తేనే.. దేవుడు కనబడ్డాడు నాకు.. జీవితాంతం పొలంలో పనిచేసే రైతు, కూలన్నలకు మనం ఋణపడి ఉన్నాము.. అందరూ నెలకొక్కసారన్నా పొలం వెళితే.. ఆహారాన్ని పారవేయం’అంటూ తన అభిప్రాయాన్ని, రైతులు పడే కష్టాన్ని తెలియజేశారు ఆర్కే.

No comments:

Post a Comment