Breaking News

10/08/2019

సిగ్నల్ ఎఫక్ట్ తో పరేషాన్

నల్గొండ, ఆగస్టు 10, (way2newstv.in)
మొబైల్ కనక్షన్, జీపీఎస్ సిగ్నల్, ఆధార్ అనుసంధానం వంటి సాంకేతిక పరిజ్ఞానంపై వారికి ఏ మాత్రం అవగహన లేదు... సమస్య ఏదైనా వీరికి తెలిసిందల్లా ఒక్కటే... అదే నెలనెలా ప్రభుత్వం సబ్సిడీపై ఇచ్చే రేషన్ బియ్యం. సకాలంలో రేషన్ బియ్యం అందకపోతే పస్తులు ఉండాల్సిన పరిస్థితి కూడా కొంతమంది నిరుపేదలకు లేకపోలేదు. నిన్న మొన్నటి వరకు రేషన్ డీలర్ల సమ్మెతో ఇబ్బందిపడిన పేద ప్రజలు, ప్రస్తుతం ప్రజా పంపిణీ వ్యవస్థకు సాంకేతిక సమస్య తలెత్తడంతో నాలుగైదు రోజులుగా రేషన్ సరుకుల పంపిణీ స్తంభించింది. దీనితో రేషన్ షాపుల్లో కంటికి ఎదురుగా బియ్యం బస్తాలు కనిపిస్తోన్న వీటి పంపిణీ నిలిచిపోవడంతో పస్తులు ఉండాల్సిన పరిస్థితి తలెత్తిందని వాపోతున్నారు. 
సిగ్నల్ ఎఫక్ట్ తో పరేషాన్

ప్రజా పంపిణీ వ్యవస్థను ఈ-పాస్‌కు  అనుసంధానం చేయడంతో వీటికి సంబంధించిన సర్వర్లు పని చేయకపోవడంతో రాష్టవ్య్రాప్తంగా సరుకుల పంపిణీ నిలిచిపోయింది తప్ప ఇందులో తమ ప్రమేయం ఏమి లేదని డీలర్లు చేతులు ఎత్తేసారు. దీంతో ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ బియ్యంపై ఆధారపడిన లక్షలాది మంది పేదలు వాటిని ఎప్పుడిస్తారని కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. రేషన్ బియ్యం ఎప్పుడు ఇస్తారో చెబితే అప్పుడే వస్తామని, ఏది చెప్పకపోవడం వల్ల నాలుగు రోజులుగా రేషన్ షాపుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ పడిగాపులు కాస్తున్నామని సబ్సిడీ బియ్యం లబ్ధిదారులు వాపోతున్నారు. ఈ-పాస్‌కు సిగ్నల్ సమస్య, సర్వర్ల డౌన్ వంటి సాంకేతిక సమస్యలు తలెత్తడం వల్ల సరుకుల పంపిణీ నిలిచిపోవడానికి కారణమని, ఈ విషయంలో తామేమి చేయలేమంటూ డీలర్లు చేతులు ఎత్తేయడంతో సబ్సిడీ బియ్యం కోసం నిరుపేదలు గత నాలుగు రోజులుగా పడిగాపులు కాస్తున్నారు. రాష్టవ్య్రాప్తంగా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న 85 లక్షల కుటుంబాలు రేషన్ కార్డులు కలిగి ఉన్నారు. వీరికి నెలనెలా సరుకుల పంపిణీ కోసం 17,400 రేషన్ షాపులు రాష్ట్రం మొత్తంగా ఉన్నాయి. ప్రభుత్వం ప్రతీ నెలా రేషన్‌కార్డు కలిగిన కుటుంబాలకు లక్ష 75 వేల మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేస్తోంది. కార్డుదారుల కుటుంబ సభ్యులు ఒకొక్కరికి నెలకు ఆరు కిలోల చొప్పున బియ్యం అందజేస్తుంది. సాధారణంగా ప్రతి నెల మొదటి వారంలోనే సబ్సిడీ బియ్యం పూర్తి అయ్యేది. కానీ ప్రజా పంపిణీని అనుసంధానం చేసిన ఈ-పాస్‌కు సాంకేతిక సమస్య తలెత్తడంతో ఈ నెలలో సబ్సిడీ బియ్యం అందక పేదలు అల్లాడిపోతున్నారు.

No comments:

Post a Comment